నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీన్ రివర్స్: పామును తిన్న కప్ప

By Pratap
|
Google Oneindia TeluguNews

Frog eats snake in Nizamabad district
నిజామాబాద్: తనను కరిచిన పామును కసి కొద్ది కొరికిన మనిషి గురించి ఇటీవలే మనం చదివాం. అది నేపాల్‌లో జరిగింది. మన రాష్ట్రంలో అంతకన్నా విచిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. ఓ కప్ప తనను మింగబోయిన పామును తినేసి, బ్రేవ్‌మంది. నిజామాబాద్ జిల్లా గాంధారిలో ఈ సంఘటన జరిగింది.

ఒక జీవిని మరో జీవి తినడం ప్రకృతి సహజం. కానీ తమ కన్నా సన్నజీవులను పెద్ద జీవులు తినడం పరిపాటి. కప్పను పాము తినడం విచిత్రమేమీ కాదు, కానీ పామును కప్ప తినడం నిజంగా విచిత్రం, ప్రకృతి విరుద్ధం కూడానేమో. నిజామాబాద్ జిల్లా గాంధారిలో ఆదివారం సాయంత్రం అటువంటి విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.

నిజామాబాద్ జిల్లా గాంధారిలోని బోగేశ్వర ఆలయ సమీపంలో ఆదివారం సాయంత్రం ఓ కప్ప పామును నోట్లో పెట్టుకోని తినేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పాముకు, కప్పకు మధ్య తీవ్రమైన పెనుగులాట జరిగింది. ఈ పెనుగులాటలో చివరికి కప్పే విజయం సాధించింది. తర్వాత కప్ప పామును మెల్లమెల్లగా తినడం ప్రారంభించింది. ఈ దృశ్యం కాలనీవాసుల కంటబడటంతో పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడారు. అంత మంది వచ్చినా కప్ప ఏమాత్రం బెదరకుండా పామును మెల్లమెల్లగా ఆరగించింది. కలి కాలం అంటే ఇదే కాబోలు. ఈ విషయాన్ని బ్రహ్మంగారు ఎక్కడైనా చెప్పారేమో చూడాలి.

ఓ నేపాలీ రైతు నాగుపామును కొరికి కరిచిన సంఘటన నేపాల్‌లో చోటు చేసుకుంది. ఆ పాము తనను కరిచినందుకు టిట్ ఫర్ టాట్ అంటూ దానిని కర్రతో కొట్టి కాకుండా నోటితో కొరికి చంపాడు. ఈ వార్తను నేపాల్ దిన పత్రిక అన్నపూర్ణ డెయిలీ పోస్ట్ ఇటీవల ప్రచురించింది. మొహమ్మద్ సాల్మో మియా అనే రైతు మంగళవారం రోజు తనను కరచిన ఓ నాగుపాము వెంటపడి దానిని పట్టుకొని కొరికి చంపాడు.

English summary
A snake has been eateb by a frog at Gandhari village of Nizamabad district. A Nepali man who was bitten by a cobra snake bit it back and killed the reptile in a tit-for-tat attack, a newspaper said recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X