'జనార్ధన్ రెడ్డి'తో జాగ్రత్త: హైకోర్టు జడ్జి చమత్కారం

దీంతో కోర్టు హాలులో నవ్వులు విరిశాయి. ఈ వ్యాఖ్యలు చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్మోహన్ రెడ్డి. ఆయన సరదాగా ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసు ఎంతగా వివాదాస్పదమయిందో అందరికీ తెలిసిన విషయమే.
గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసులో గత సంవత్సరం అరెస్టయ్యారు. అయితే ఆ తర్వాత తనకు బెయిల్ ఇప్పించేందుకు ఆయన పలువురికి రూ.15 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు ఆశ చూపారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ బెయిల్ ఫర్ సేల్ కేసులో ఇప్పటికే న్యాయమూర్తులు సహా పలువురు అరెస్టయ్యారు. వారిని ఎసిబి విచారిస్తోంది.
గాలికి బెయిల్ ఇచ్చేందుకు రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. వంద కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డాడట. అయితే రూ.15 కోట్లకే మరో బేరం కుదరడంతో వంద కోట్ల ఆఫర్ మాసిపోయింది. ఈ నేపథ్యంలో కర్నాటక హైకోర్టు జడ్జి ఇలా సరాదాగా జనార్ధన్ రెడ్డి పేరు అంటేనే అమ్మో అనడం గమనార్హం.












Click it and Unblock the Notifications