వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారు లేదని చెప్పిన జగన్... జరిమానా కట్టలేదా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు కారు ఉన్నప్పటికీ కారు లేదని ఇటీవల ఉప ఎన్నికల సమయంలో పేర్కొన్నారట. గత ఏడాది పులివెందుల, కడప ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల సమయంలో జగన్ తన అఫిడవిట్‌లో తనకు కారు లేదని పేర్కొన్నారు. అయితే అతని పేరు మీద ఓ స్కార్పియో కారు ఉందట!

ఉప ఎన్నికల సమయంలో తన అఫిడవిట్‌‌లో వాహనాలు అనే కాలమ్‌లో తనతో పాటు తన భార్య పేరిట కూడా ఎలాంటి వాహనాలు లేవని తెలిపారు. కానీ ఆయన తన పేరిట 2009 ఆగస్టు 28న ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణాధికారి కార్యాలయంలో వాహనాన్ని రిజిస్టర్ చేశారట. అది నల్లటి స్కార్పియోనంట. అయితే ప్రమాణ పత్రంలో మాత్రం జగన్ తనకు స్కార్పియో కారు ఉన్న విషయాన్ని చెప్పలేదట.

మరో విషయమేమంటే... జగన్‌కు కారున్న సంగతి ఈ-చలాన్ సాక్షిగా బయటపడిందట. గత ఏడాది నవంబర్ 13వ తేదిన మధ్యాహ్నం 1.12 గంటలకు ఈ నల్లటి స్కార్పియో హైదరాబాదులోని పివి ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్ పై నుంచి పరిమితికి మించిన వేగంతో దూసుకు పోయిందట. నిబంధనలను ఉల్లంఘించడంతో ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్ కూడా సిద్ధం చేశారట.

పరిమితికి మించిన వేగంతో వెళ్లినందుకు వంద రూపాయల జరిమానా విధించారట. యూజర్ ఛార్జీలతో కలిపి మొత్తం రూ.135 కట్టాల్సి ఉంది. అయితే ఈ జరిమానాను జగన్ ఇంత వరకు చెల్లించలేదట! తనకు కారు లేదని జగన్ ప్రమాణ పత్రంలో పేర్కొన్నప్పటికీ ఈ-చలాన్ ద్వారా బయటపడిందట.

English summary
It is said that YSR COngress chief and Kadapa MP 
 
 YS Jaganmohan Reddy have black scorpio car with 
 
 his name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X