వైయస్ జగన్ బాటలో నారా లోకేష్?

నారా లోకేష్‌కు తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు కట్టబెట్టారంటూ నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పైగా 2014 ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు నారా లోకేష్ ఇప్పటికే ఓ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేశారనీ, ఆ మ్యాప్‌ను అనుసరిస్తే అధికారం ఖాయమని జాతీయ మీడియాలో వార్తలు చోటు చేసుకున్నాయి.
మరోవైపు లోకేష్ ఎంట్రీతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో చర్చ ప్రారంభమైనట్లు చెబుతున్నారు. లోకేష్‌కు ఎలాంటి బాధ్యతలు కట్టబెట్టారో తెలుసుకుని తమ కథానాయకుడి పాత్ర ఎలా ఉండాలో డిమాండ్ చేసేందుకు వారంతా సిద్ధమవుతున్నారని అంటున్నారు. పార్టీలో జూనియర్ ఎన్టీఆర్‌కు తగిన బాధ్యతలు అప్పగించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతను చేపట్టిన జూనియర్ ఎన్టీఆర్‌కు నారా లోకేష్ కల్పించిన స్థాయికి తగ్గకుండా కల్పించాలనేది వారి డిమాండ్‌గా కనిపిస్తోంది. ఏమైనా, తెలుగుదేశం పార్టీలోకి యువరక్తం వస్తోందని అంటున్నారు.