వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైళ్లలో నేతలు: నవ్వుతూ ఎందుకు కనిపిస్తున్నారు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Kanimoli
అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైళ్లకు వెళుతున్న నేతలు జైలులోకి వెళ్లేముందు, బయటకు వచ్చేటప్పుడు నవ్వుతూనే కనిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2జి కుంభకోణంలో అరెస్టైన కేంద్ర మాజీ మంత్రి రాజా, డిఎంకె ఎంపి కనిమొళి, ఓబుళాపురం మైనింగ్ కార్పోరేషన్ కేసులో అరెస్టైన గాలి జనార్ధన్ రెడ్డి, అక్రమాస్తుల కేసులో అరెస్టైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఇలా ఎవరైనా రాజకీయ నేతలు జైళ్లకు వెళుతున్నప్పటికీ నవ్వుతూనే కనిపిస్తున్నారు.

వారిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని అంటున్నారు. తప్పు చేశామన్న భావన కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. సాధారణంగా ఏదైనా చిన్న తప్పు చేసి జైలుకు వెళ్తేనే సాధారణ వ్యక్తులు, ఇతర రంగాల వ్యక్తులు గిల్టీగా ఫీల్ అవుతారు. అయితే రాజకీయ నేతలు మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటారని అంటున్నారు. లక్షల కోట్లు, వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ వారు తమ ముఖ కవళికలలో మార్పులు కనిపించకుండా జాగ్రత్త పడతారని అంటున్నారు.

ఇందుకు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. మిగతా రంగాలలోని ప్రముఖులు, సాధారణ వ్యక్తుల వలె జైలుకు వెళ్లినప్పుడు చిరు నవ్వు కనిపించకుండా బాధతో కనిపిస్తే తప్పు చేశామనే భావన ప్రజల్లో కలుగుతుందని నేతలు భావిస్తారని, అందుకే లోపలున్న బాధను బయటకు కనిపించకుండా జాగ్రత్త పడతారని అంటున్నారు. ముఖ్యంగా తాము విషణ్ణవదనంతో ఉంటే తమ పార్టీ కార్యకర్తలలో, తమను అనుసరించే వారిలో నిస్తేజం నిండుకుంటుందని, వారిలో నిరుత్సాహం కలగకుండా చేయాలంటే ఇది తప్ప నేతలకు మరో దారి లేదని అంటున్నారు.

జైలులో ఉన్నప్పటికీ నవ్వుతూనే కనిపించడం వల్ల క్యాడర్‌లో ఉత్సాహం తగ్గదని నేతలు భావిస్తారని అంటున్నారు. లేదంటే తమ నేత తప్పు చేశాడేమోనని భావన వారిలో కలగడంతో పాటు సామాన్యులలోనూ అదే అభిప్రాయం కలుగుతుందని నేతలు భావిస్తారని అంటున్నారు. ఇటీవల జైలు నుండి విడుదలయి రాజా తన సొంత నియోజకవర్గానికి రెండు రోజుల క్రితం వెళ్లినప్పుడు అనుచరులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.

దాదాపు సంవత్సరంన్నరపాటు రాజా జైలులో ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గం నేతలు రాజాకు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలలో ఉత్సాహం నింపాలంటే, సామాన్యులలో తాము తప్పు చేయలేదనే భావన కలిగించాలంటే నవ్వును మించిన ఔషధం లేదని నేతలు భావిస్తున్నారని అంటున్నారు.

English summary
The ability to remain poker faced or even smiling in adverse consitions does not come easy to normal people. Our politicians, however, have nartured and developed this very ability and whether they are coming out of or going in to jail, they never forget to smile.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X