జగన్ ఖాతాలో రూ.4 వేలు, పార్టీ ఎలా ఉందని ఆరా

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఖాతాలో రూ.4వేలు మాత్రమే ఉన్నాయట! అక్రమాస్తుల కేసులో జగన్ గత నెల 27వ అరెస్టైన విషయం తెలిసిందే. ఆయన జైలుకు వెళ్లేటప్పుడు ఆయన జేబులో చిల్లిగవ్వ లేదు. జైలుకు వెళ్లినప్పుడు జైలు అధికారులు మొదట నిందితుల వద్ద ఉన్న వాటిని తీసుకొని జైలు ఖాతాలో జమ చేస్తారు. అయితే 27న జగన్ జైలుకు వెళ్లినప్పుడు ఆయన వద్ద ఏమీలేదు. ఆ తర్వాత మాత్రం వారి కుటుంబ సభ్యులు రూ.4వేలు ఆయన అకౌంట్‌లో వేశారు. కానీ జగన్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి వాడలేదు.

చంచల్‌గూడ జైలులో ఉంటున్న జగన్ జైలు జీవితానికి అలవాటుపడుతున్నారని అంటున్నారు. జైలుకు వెళ్లిన కొత్తలో ఆయన ముభావంగా కనిపించేవారట. కానీ ఇప్పుడు బ్యారక్‌లో ఉన్న సహచర విఐపి ఖైదీలతో కలిసి అప్పుడప్పుడూ కప్పు టీ తాగుతూ.. కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారట. ఆయన ఇతర విఐపి ఖైదీల మాదిరి చెస్, క్యారమ్స్ ఆడటం లేదట. ఉదయం, సాయంత్రం షటిల్ మాత్రం ఆడుతున్నారట.

సాయంత్రం విఐపి ఖైదీలతో కలిసి వారి బ్యారక్‌లో చెట్ల కింద కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నట్లు తెలిసింది. జైలు సిబ్బంది ఎవరైనా అటువైపు వస్తే లేదా ములాఖత్‌కు వెళ్లే దారిలో కలిసినప్పుడు వారి జిల్లా పేరు అడగటం, ఆ జిల్లాలో తన పార్టీ ఎలా ఉందంటూ ఆరా తీయడం చేస్తున్నారట. కాగా మంగళవారం ఆయన కుటుంబ సభ్యులు ఆయనను కలిసి పరామర్శించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలోనే వారు కలిశారు. భార్య భారతి, సోదరి షర్మిల బావ అనిల్ జగన్‌ను మధ్యాహ్నం రెండున్నర గంటలకు కలిశారు.

కాగా తన ఖాతాలోని రూ.4వేలలో జగన్ ఏమీ వాడుకోలేదు. జగన్‌తో పాటు పలు విఐపి ఖైదులు తమ తమ ఖాతాలలో కొద్దిగా డబ్బు వేసుకున్నారు. జైలు నిబంధనల ప్రకారం నిందితుల ఖాతాలో నెలకు రూ.మూడు వేలు ఉండాలని తెలుస్తోంది. మహిళా జైలులో ఉన్న శ్రీలక్ష్మి, రాజగోపాల్, బిపి ఆచార్య ఖాతాలలో చిల్లి గవ్వ కూడా లేదట. రాజగోపాల్ కోసం కుటుంబ సభ్యులు వారానికి సరిపడా మందులు తెచ్చి ఇస్తున్నారు.

కోనేరు ప్రసాద్ ఖాతాలు రూ.4వేలు, సునీల్ రెడ్డి ఖాతాలో రూ.15వేలు, ఇటీవలే జైలు నుండి విడుదలయిన విజయ సాయి రెడ్డి ఖాతాలో రూ.9వేలు, నిమ్మగడ్డ ప్రసాద్ ఖాతాలో రూ.3వేలు, బ్రహ్మానంద రెడ్డి ఖాతాలో రూ.600, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఖాతాలో రూ.10వేలు ఉన్నాయట. వీరెవరూ తమ డబ్బును ఖర్చు చేయలేదట. ఓఎంసి కేసులో అరెస్టైన గాలి జనార్ధన్ రెడ్డి ఖాతాలో అత్యంధికంగా రూ.32వేలు ఉన్నాయట. ఆయనను కొద్దికాలం క్రితం కర్నాటకకు తరలించేటప్పుడు కూడా అంతే మొత్తం ఆయన ఖాతాలో ఉన్నాయి. జైలులో ఆయన మినరల్ వాటర్ తప్ప ఏమీ కొనలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+