• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయస్ జగన్ వర్గం నేత సబ్బం పబ్బం

By Pratap
|

Sabbam Hari
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట బాహాటంగా నడుస్తూ కాంగ్రెసులో కొనసాగుతున్న పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి తీరుపై ఇప్పుడిప్పుడే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన రెండు ముక్కలాట ఆడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్టప్రతి ఎన్నిక సందర్భంగా ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ స్వయంగా సబ్బం హరికి ఫోన్‌ చేసి మద్దతు కోరటం పట్ల ఎఐసిసి కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్టప్రతిగా ప్రణబ్‌ ముఖర్జీ విజయం ఖాయమని ఎప్పుడో తేలిపోయిన నేపథ్యంలో, హరి సాంకేతికంగా కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుడే అయినప్పటికీ ఒక్క వోటు కోసం ఆయనకు ఫోన్‌ చేయటమేమిటని విహెచ్ ప్రశ్నిస్తున్నారు.

ఆ వ్యవహారంపై ఏకంగా ఆజాద్‌తో హనుమంతరావు మాట్లాడారని, నిరసన వ్యక్తం చేశారనీ తెలిసింది. జగన్‌ పార్టీ కూడా ప్రణబ్‌కే మద్దతు ఇచ్చింది కాబట్టి సరిపోయింది కానీ, ఆ పార్టీ అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుని ఉంటే, అప్పుడు కూడా సబ్బం సాంకేతికంగా కాంగ్రెస్‌ సభ్యుడన్న సాకుతో ఫోన్‌ చేసే వారేనా అని ప్రశ్ని స్తున్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌, హర్ష కుమార్‌, లగడపాటి రాజగోపాల్‌ లాంటి పార్లమెంటు సభ్యులు సైతం సబ్బం హరి పట్ల తమ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.

కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలలో ఒకరైన ఆజాద్‌ అలా వ్యవహరిస్తే అదే రాష్టప్రతి ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అందుకు భిన్నంగా వ్యవహరించారు. జగన్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఆళ్ళ నాని, రాజా సుజయ కృష్ణ రంగారావుకు ముఖ్యమంత్రి నుంచి కానీ, పీసీసీ నుంచి కానీ ఎలాంటి ఫోన్లు వెళ్ళలేదు. వారిని వోట్లు అర్థించలేదు. వారిప్పుడు సాంకేతికంగా తమ ఎమ్మెల్యేలే అయినా జగన్‌ శిబిరానికి ఫిరాయించారు కాబట్టి వారికి ఫోన్లు చేసేది లేదని, వారు ఇష్టం వచ్చిన వారికి వోట్లు వేసుకోవచ్చునని బొత్స బాహాటంగానే స్పష్టం చేశారు.

సబ్బం హరి రెండు పార్టీలో కొనసాగుతుండడం చాలా మందికి మింగుడు పడడం లేదు. ఒక సందర్భంలో ఆయనపై చర్య తీసుకుంటామని బొత్స ప్రకటిస్తే, తాను ఎంపీని కాబట్టి పిసిసికి ఆ అధికారం లేదని సబ్బం హరి జవాబిచ్చారు. ఇంత జరిగినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యా తీసుకోకపోవడంలోని ఆంతర్యం అర్థం కాక చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. బాహాటంగా పార్టీని విమర్శిస్తున్నా, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తప్పు పడుతున్నా సబ్బం హరిపై చర్య తీసుకోకపోవడమేమిటనే ప్రశ్న పార్టీ వర్గాల నుంచే అధిష్టానానికి ఎదురవుతోంది.

English summary

 Congress Rajyasabha member and senior leader V hanumanth Rao has expressed his dissatisfaction over the party attitude towards YS Jagan camp MP Sabbam Hari. Sabbam Hari continuing in Congress acting as YSR Congress leader, it is alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X