భార్యకు టిడిపి టికెట్ కోసం లక్ష్మినారాయణ?

వైయస్ జగన్ అయితే ఓ రకంగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అయితే మరోలా లక్ష్మినారాయణ చూస్తున్నారని వ్యాఖ్యానించింది. చంద్రబాబు కేసులో సిబిఐ నిర్లిప్తంగా వ్యవహరించిందని విమర్శించింది. అప్పట్లో ఓ డబ్బా కంపెనీకి చంద్రబాబు 850 ఎకరాలు కట్టబెట్టారని, అది ఐఎంజీ ఫ్లోరిడాకు అనుబంధమంటూ అబద్ధాలు ఆడారని, ఐఎంజి అధికారుల పేరుతో దొంగ ఇమెయిల్స్ సృష్టించారని, అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు రూ. 50 వేలకే ఆ భూమిని దారాదత్తం చేశారని సాక్షి డైలీ వ్యాఖ్యానిస్తూ ఆధారాలతో సహా దొంగలు దొరికినా సిబిఐ అనాసక్తి ప్రదర్శించిందని, వనరులు లేవంటూ చేతులు దులుపుకుందని, అప్పుడు కూడా రాష్ట్రంలో సిబిఐ జెడి లక్ష్మినారాయణే అని విమర్శించింది. మొత్తం మీద, లక్ష్మినారాయణ వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా అనుమానాలు కలిగించే విధంగా జగన్ లాబీ వ్యవహరిస్తోంది.












Click it and Unblock the Notifications