తెలుగు సభలకు నిరసన: జగన్ పార్టీ సెగ

భాషోద్యమ సమితి నిరసనకు సంఘీభావం తెలుపుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల తీరును భూమన కరుణాకర్ రెడ్డి మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. తెలుగు భాష అమలుకు ఆచరణసాధ్యమైన విధానాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెలుగు భాషోద్యమ సమితి డిమాండ్ చేస్తోంది.
తెలుగు పరిరక్షణ కోసమంటూ తెలుగు భాషోద్యమ సమితి చేస్తున్న ఆందోళనకు మరో వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదరువుతోంది. ఉపాధికి సంబంధం లేని తెలుగు భాషా పరిరక్షణ అవసరం లేదని దళిత మేధావి కంచ ఐలయ్య లాంటివారు అంటున్నారు. తెలుగు భాషను చదివితే, ఉద్యోగాలు వచ్చేట్లయితే ఉపయోగం ఉంటుందని, ఆంగ్లం నేర్చుకోకపోతే ఉద్యోగాలు రావడం లేదని అంటున్నారు.
భాషను పరిరక్షించాలంటే, కచ్చితంగా ఉపాధితో సంబంధంతో ఉండాలని అంటున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ఎన్ గోపి అప్పట్లోనే ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పారు. ఉపాధికీ, భాషా పరిరక్షణకు మధ్య అవినాభావమైన సంబంధం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఏమైనా, భాషా పరిరక్షణ అనేది కేవలం ఆదర్శం వల్ల సాధ్యం కాదు, దానికి ఆచరణ తోడు కావాలంటే కచ్చితంగా ఉపాదితో లింక్ పెట్టాల్సిందే..












Click it and Unblock the Notifications