వైయస్ జగన్ అరెస్టుపై ట్విట్టర్ సైలెంట్

ఇండియాలోని చెన్నై, హైదరాబాదులోని వైయస్ జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి కొద్ది గంటల పాటు 9వ స్థానంలో నిలిచారు. రెండు రోజుల క్రితం జగన్ టాప్ 5లో ఉన్నారు. శుక్రవారం మొదటిసారి జగన్ సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో నెటిజన్లు చూపిన ఆసక్తి అరెస్టయిన రోజు చూపించలేదు. జగన్ అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ గానీ వ్యతిరేకిస్తూ గానీ పెద్దగా నెటిజన్లు ముందుకు రాలేదు. బహుశా, ఐపియల్ ఫైనల్ మ్యాచులపైనే నెటిజన్లు బిజీగా ఉండి ఉంటారు.
ఐపియల్ విజేతపై అంచనాలు వేస్తూ, స్కోర్లను పంచుకుంటూ నెటిజన్లు మునిగిపోయి ఉంటారు. కొద్ది మంది మాత్రం ట్వీట్ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నంత వరకు కర్ణాటక అవినీతిపై దృష్టి సారించలేదని, ఆ తర్వాత ఒక దెబ్బతో రెండు పిట్టలను కొట్టారని ఒకతను వ్యాఖ్యానించాడు.
ఇలా కొద్ది మంది నెటిజన్లు మాత్రమే వైయస్ జగన్ అరెస్టుపై వ్యాఖ్యానాలు చేశారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లో ఆదివారం వైయస్ జగన్ అరెస్టుపై యాక్టివిటీ తక్కువగా కనిపించడంపై ఆరాలు తీస్తున్నారు. హైదరాబాదు వంటి నగరాల్లో కూడా ప్రజలు ఐపియల్ ఫైనల్ మ్యాచు చూడడంలోనే మునిగిపోయినట్లు తెలుస్తోంది. టీవీ సెట్ల వద్ద జనాలు గుమికూడి ఐపియల్ మ్యాచు చూడడంలోనే మునిగిపోయారు.












Click it and Unblock the Notifications