చిరంజీవికి పోటీగానే బొత్స వైఖరి మార్పు?

కానీ, ఇటీవలి కాలంలో ఆయన సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారు. తాను సమైక్యవాదినని ఇటీవల మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రజారాజ్యం పార్టీ వైఖరిగా తొలుత సామాజిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన ప్రస్తుత కేంద్ర మంత్రి చిరంజీవి, 2009 డిసెంబర్ 9వ తేదీన కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయగానే సమైక్యావాదిగా మారిపోయారు. సీమాంధ్ర అంతటా కలియతిరిగారు.
ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెసులో ఉన్నారు. దీంతో బొత్స సత్యనారాయణ తన వైఖరిని మార్చుకోక తప్పలేదని అంటున్నారు. పైగా, కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు కూడా ఆయనకు తెలిసి వచ్చిందని అంటున్నారు. ఒకవేళ కేంద్రం అనూహ్యంగానో, ముందస్తు నిర్ణయం మేరకో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తే సీమాంధ్రలో తన పరిస్థితి ఏమిటనే మీమాంసలో బొత్స పడ్డారని అంటున్నారు.
తెలంగాణ విడిపోతే సీమాంధ్ర రాష్ట్రంలో సమైక్యవాదాన్ని వినిపించిన చిరంజీవి కాంగ్రెసు తరఫున నాయకుడిగా ముందుకు వచ్చి, ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలు ఉంటాయి. ఈ స్థితిలో చిరంజీవిని ఎదుర్కుని ముఖ్యమంత్రి పదవికి పోటీ పడాలనే ఉద్దేశంతోనే బొత్స సత్యనారాయణ సమైక్యవాద గళం విప్పినట్లు చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ ఆశయం నెరవేరుతుందో, లేదో వేచి చూడాల్సిందే...












Click it and Unblock the Notifications