వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెవిపి 'వైయస్' వ్యాఖ్య: సిఎం సైలెన్స్ వెనుక...

By Srinivas
|
Google Oneindia TeluguNews

KVP Ramachandar Rao - Kiran Kumar Reddy
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటో లేదంటూ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. దీంతో పార్టీ నేతలలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెవిపి వ్యాఖ్యలపై పలువురు నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు ఆయనను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోవర్టుగా అభివర్ణించారు. ఆయన ఎప్పటికైనా జగన్ పార్టీలోకి వెళతారని ఆరోపించారు.

అయితే ఇంత జరుగుతున్నా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఇంత వరకు స్పందించలేదు. అంతెందుకు కెవిపి వైయస్ ఫోటో లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు అదే కార్యక్రమంలో కిరణ్ కూడా ఉన్నారు. ఆ తర్వాత మాట్లాడిన యువజన కాంగ్రెసు మాజీ అధ్యక్షుడు కూడా మరో సంచలన వ్యాఖ్య చేశారు. కిరణ్ కేబినెట్లో ఉన్న పలువురు మంత్రులు జగన్‌తో ఫోన్ సంబంధాలు నెరుపుతున్నారని, వారు 2014 ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసులోకి వెళతారని, కావాలంటే వారి ఫోన్ నెంబర్ల డాటాను పరిశీలించ వచ్చునని సవాల్ విసిరినంత పని చేశారు.

అక్కడే ఉన్న కిరణ్ మాత్రం ఇటు కెవిపి వ్యాఖ్యల పై గానీ, అటు యువజన నేత చేసిన వ్యాఖ్యలపై స్పందించలేదు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కిరణ్ తన ప్రసంగంలో కూడా ఎక్కడా వీరి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అంశం జోలికి వెళ్లలేదు. అసలు ఆ వ్యాఖ్యలు విననట్లుగానే కిరణ్ ప్రసంగా ఆద్యాంతం కొనసాగింది. అయితే కిరణ్ వారి వ్యాఖ్యలను విస్మరించడంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.

కొన్నాళ్లుగా మాజీ మంత్రి శంకర రావు, మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిలు ముఖ్యమంత్రి కిరణ్ జగన్ అసలు కోవర్టు అని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ పలువురిలో ఆ చర్చ ప్రారంభమైంది. కెవిపి ఇంతటి ఘాటైన వ్యాఖ్యలు చేసినా, యువజన నేత మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేసినా కిరణ్ స్పందించక పోవడంతో ఆ నేతల ఆరోపణలు నిజమేనా అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారట.

కిరణ్... జగన్ పైన మొదట్లో విమర్శలు చేయలేదు. అయితే కోవర్టు అంటూ తీవ్ర విమర్శలు రావడంతో ఆయన జగన్ పైన తన దూకుడు పెంచారు. కానీ ఇప్పుడు ఏకంగా పార్టీనే ఓ కుదుపు కుదిపిన ఈ సంఘటనపై కిరణ్ సైలెన్స్ మాత్రం అందరి మదిని తొలుస్తోందట. జగన్‌కు అనుకూలంగా లేనప్పుడు కిరణ్ ఎందుకు స్పందించడం లేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు కాంగ్రెసు నేతలు ఎంతగా విమర్శలు చేసినప్పటికీ కెవిపి రామచంద్ర రావు కూడా ఇప్పటి వరకు పెదవి విప్పలేదు.

English summary

 It is said that the question is raising in Congress leaders that "Why Kiran Kumar Reddy is not responding on KVP Ramachandra Rao statement".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X