వైయస్ వివేకాను ఎందుకు పక్కన పెట్టారు?

YS Vivekananda Reddy
కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాజ్యసభ పదవి విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డిని పక్కన పెట్టింది. సొంత కుంపటి పెట్టుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కడప జిల్లాలో ఎదుర్కోవాలంటే కాంగ్రెసుకు వైయస్ వివేకానంద తప్పనిసరి. కడపలో ముప్పై ఏళ్లుగా వైయస్ కుటుంబానిదే ఆధిపత్యం. ఇప్పుడు జగన్ పార్టీ వీడటంతో జిల్లాలో దాదాపు అందరూ జగన్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో అక్కడ పార్టీని రక్షించుకోవాలంటే వైయస్ వివేకాకు అధిష్టానం పదవి ఇచ్చి ప్రోత్సహిస్తుందని అందరూ భావించారు. వివేకా కూడా రాజ్యసభ కోసం కాళ్లకు బలపం కట్టుకొని మరి ఢిల్లీలో తిరిగారు. కానీ పార్టీ తుది జాబితాలో మాత్రం ఆయన పేరు లేదు.

వైయస్ వివేకానంద రెడ్డిని రాజ్యసభకు పంపే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయన పేరును పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయనను సంజీవ రెడ్డి స్థానంలో తీసుకుంటారని భావించారు. అయితే ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో సోనియా అదే సమాజిక వర్గానికి చెందిన మరో నేత కోసం రాష్ట్ర నేతలను అడిగారట. దీంతో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పేరు తెర పైకి వచ్చింది. అధిష్టానానికి విశ్వసనీయంగా ఉండటం, తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం, సీనియారిటీ ఉండటం ఇలా పలు అశాలను పరిగణలోకి తీసుకొని సోనియా గాంధీ పాల్వాయిని ఎంపిక చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+