వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజ్యసభకు వైయస్ విజయమ్మ పోటీ?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 17 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది. అనర్హత వేటులో స్పీకర్ జాప్యం చేస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలపై వైయస్ జగన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పది మంది శాసనసభ్యులు రాజ్యసభ అభ్యర్థిని ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఆ 17 మంది మద్దతుతో పాటు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మద్దతు కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణపై కాంగ్రెసు మోసం చేస్తోంది కాబట్టే కాంగ్రెసును ఓడించడమే లక్ష్యంగా తెరాస మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అలాగే, వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానం ఉన్న మరి కొంత మంది కాంగ్రెసు శాసనసభ్యుల మద్దతు కూడా కూడగట్టుకోవచ్చుననేది ఆలోచనగా చెబుతున్నారు.