వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విరాట్ కోహ్లీని ముద్దాడిన తార అనుష్క?

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ హిందీ తార అనుష్క శర్మకు పడిపోయినట్లు బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వారిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దక్షిణాఫ్రికాకు బయలుదేరే ముందు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ఇంటికి వెళ్లాడట. ఆమె కోహ్లీకి గాఢమైన ముద్దు ఇచ్చినట్లు మిడ్డేలో వార్త వచ్చింది.

ఆ పుకార్లపై అనుష్క శర్మ తీవ్రంగా స్పందించింది. కోహ్లీ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని, ఒక ప్రకటనలో కలిసి నటించినంత మాత్రాన ప్రేమించుకుంటున్నట్లా అని అన్నది. అయితే తాజాగా అనుష్క శర్మ ఇంటికి విరాట్ కోహ్లి వెళ్లడం అక్కడ వీరిద్దరూ ముద్దుల్లో ముంచెత్తుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

 Virat Kohli

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళేముందు విరాట్ సోమవారం రాత్రి 10 గంటల సమయంలో అనుష్క ఇంటికి కారులో వెళ్ళాడట. విరాట్‌ కోహ్లి నేరుగా అనుష్క శ‌ర్మ ఇంటికి వెళ్ళి, ఓ గంట సేపు ఉన్నాడట. త‌రువాత వీరిద్దరూ క‌లిసి బయ‌ట‌కు వెళ్ళేందుకు పార్కింగ్ ఏరియాకు వ‌చ్చారు.

ఇద్దరూ వారి సొంత కారులో వెళ్ళడానికి నిశ్ఛయించుకున్నారు. విరాట్‌కోహ్లి కారు ఎక్కబోతుండ‌గా అనుష్క శ‌ర్మ కోహ్లీకి లిప్‌కిస్ ఇచ్చిందట. అయితే ఈ సీన్‌ను ఆ అపార్ట్‌మెంట్‌లోని వారంతా చూశారంట‌. దాంతో అది ముంబైలో గుప్పుమంది. సీన్ కట్ చేస్తే తెల్లవారేలోపు ఆ న్యూస్ బాలీవుడ్‌ మొత్తం పాకింది.

English summary

 Quoting an eyewitness, a Mid-Day report says that around 10:45 pm, both, the cricketer and the actress left Anushka's place and stepped out of the lift on the second floor parking area of the building. Both were casually dressed and the actress gave him a quick kiss before he left in the car.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X