జగన్ వర్సెస్ కిరణ్: సిటీ సభకు అశోక్ బాబు దూరం?

Ashok Babu to keep away from YS jagan's Hyderabad meeting
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో సీమాంధ్ర ఉద్యోగులు రెండుగా చీలిపోయారు. ఈ నెల 19వ తేదీన సమైక్య శంఖారావం పేరు మీద వైయస్ జగన్ హైదరాబాద్ తలపెట్టిన బహిరంగ సభకు ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు వర్గం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పాల్గొనబోమని, జగన్ సమైక్య శంఖారావం సభకు తాము దూరంగా ఉంటామని అశోక్ బాబు చెప్పారు. అశోక్ బాబుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆశీస్సులు ఉన్నట్లు చెబుతున్నారు. దీనివల్ల సమ్మె చేస్తున్న ఎపిఎన్జీవోలకు ప్రభుత్వ మద్దతు కూడా లభిస్తోందని, ఇప్పుడు జగన్ సభకు వెళ్తే ప్రభుత్వ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఓ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో సమైక్యాంధ్ర ఉద్యమం జగన్, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య పోటీ పెట్టినట్లు అర్థమవుతోంది.

కాగా, ఎపిఎన్జీవోల సంఘంలో భాగమైన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం, ఎపి రాష్ట్ర రక్షణ వేదికకు చెందిన ఉద్యోగులు మాత్రం వైయస్ జగన్మోహన్ రెడ్డి సభకు మద్దతు పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 19వ తేదీన సభ నిర్వహిస్తామని ప్రకటించిన తర్వాత ఎపిఎన్జీవోల ప్రతినిధులు, ఇతర సంఘాల ప్రతినిధులు జగన్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.

సమైక్య శంఖారావం బహిరంగ సభలో పాల్గొంటామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల వేదిక చైర్మన్ యు మురళీకృష్ణ, ఎపి రాష్ట్ర రక్షణ వేదిక చైర్మన్ వి. లక్ష్మణ్ రెడ్డి తాము జగన్ సభకు మద్దతు పలుకుతామని, ఆ సభలో పాల్గొంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+