రాజకీయాలపై విసుగు: బాలయ్య అస్త్రసన్యాసం?
హైదరాబాద్: గత కొంత కాలంగా నందమూరి హీరో బాలకృష్ణ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, సినిమాల వల్ల తీరిక లేకపోవడంతో ఆయన దూరంగా ఉన్నారని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ రాజకీయాలంటే విసుగు వస్తోందని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారట. ఇటీవల కృష్ణాజిల్లాలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరైన బాలయ్య కొందరు తెలుగుదేశం అభిమానులు పలకరిస్తే కసురుకున్నారని చెబుతున్నారు.
తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, తనతో మాట్లాడవద్దని గట్టిగా చెప్పారని, అసలు రాజకీయాలంటేనే విసుగు వస్తోందని ఆయన తెలుగుదేశం నాయకులతో అన్నట్లు చెబుతున్నారు. రాజకీయ నాయకులకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారట. అయితే, బాలయ్య వైముఖ్యానికి లేదా వైరాగ్యానికి కారణం వేరే ఉందని అంటున్నారు.

తాను కోరుకున్న పెనమలూరు లేదా మరో శాసనసభ స్థానం నుంచి పోటీ చేయాలని బాలయ్య ఉత్సాహపడ్డారు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అందుకు సుముఖంగా లేరని, ఆ విషయాన్ని తన కుమారుడు లోకేష్ ద్వారా చెప్పించాడనిస, అందుకే బాలయ్య రాజకీయలపై సుముఖంగా లేరని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందో బాలయ్యకే తెలియాలి.
జూనియర్ ఎన్టీఆర్‌ను, హరికృష్ణను దూరం పెట్టినట్లునగానే బాలయ్యను కూడా చంద్రబాబు దూరం పెట్టాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర వహించడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయిన తర్వాత బాలయ్యను కూడా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంచాలనే వ్యూహాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు. అసలు విషయం ఎన్నికలు వచ్చేనాటికి గానీ తెలియదు.












Click it and Unblock the Notifications