టీపై బాలకృష్ణ హ్యాపీ: బావకే పట్టమని వ్యాఖ్య

నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణ ప్రక్రియకు బ్రేకులు వేస్తాయని ఆయన విశ్వసిస్తున్నట్లు సమాచారం. దీంతో నందమూరి బాలకృష్ణ సినిమాలకు కొంత కాలం కామా పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఏర్పడిన ఎన్నికల ఫలితాల సమాచారాన్ని వైజాగ్ షూటింగ్‌లో ఉండగానే తెలుసుకున్న ఆయన ఆనందంతో ఉన్నాడు. రాష్ట్రంలోనూ పరిస్థితి మారుతుందని తను చేస్తున్న లెజెండ్ చిత్రం తర్వాత గ్యాప్ తీసుకోనున్నట్లు సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా, ఎప్పటికప్పుడు షూటింగ్‌లోనే ఉంటూ వార్తలు సేకరించాడని వినికిడి. అందుకే ఈ చిత్రం తర్వాత గతంలో ఆయన డేట్స్ ఇచ్చిన రచయితలు, నిర్మాతలు చెప్పేవేవీ ఇప్పుడు వినే స్థితిలో లేనని తర్వాత చెబుతానని చెప్పినట్లు ఫిలిం నగర్‌లో కథనాలు విన్పిస్తున్నాయి.
రాబోయే ఏడాది తెలుగుదేశం పార్టీకి కీలకమైన పాత్ర పోషిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి రావడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. తాను కూడా శాసనసభకు పోటీ చేసి విజయం సాధించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications