జగన్‌కు బెయిల్: ఎన్డీయె కన్వీనర్‌గా చంద్రబాబు?

కాంగ్రెసుతో భవిష్యత్తులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో దోస్తీ కట్టే అవకాశాలున్నాయని ఆయన అంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు కూటమిని, తెలంగాణలో కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూటమిని ఎదుర్కోనేందుకు చంద్రబాబు ఓ బలమైన శక్తిని వెతుక్కునే క్రమంలో బిజెపి వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.
బిజెపితో దోస్తీకి సంబంధించి ఇప్పటికే బిజెపి నేతలతో తెలుగుదేశం చర్చలు పూర్తయినట్లు కూడా చెబుతున్నారు. ఎన్నికలకు ముందే పొత్తు ఖరారు కావచ్చునని అంటున్నారు. ఈ క్రమంలో ఎన్డిఎ కన్వీనర్‌గా చంద్రబాబు నియమితులు కావచ్చునని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు అక్టోబర్ 2వ తేదీన ఢిల్లీలో జరిగే సమావేశంలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో వేదికను పంచుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ఎన్డిఎతో చంద్రబాబు నాయుడు 2005లో తెగదెంపులు చేసుకున్నారు. యునైటెడ్ ఫ్రంట్ కూటమి సందర్భంలో ఎన్టీ రామారావు ఎన్డిఎ కన్వీనర్‌గా ఉన్నారు. అదే బాధ్యతలను ఇప్పుడు చంద్రబాబు స్వీకరించవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications