హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్: చిరంజీవి డిమాండ్‌కు దిగ్విజయ్ నో

By Pratap
|
Google Oneindia TeluguNews

Digvijay Singh and Chiranjeevi
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు విషయంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి చిరంజీవి డిమాండ్‌ను కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ తోసిపుచ్చారు. రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ చిరంజీవి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా గానీ ఉభయ రాష్ట్రాలకు శాశ్వత ఉమ్మడి రాజధానిగా గానీ చేయాలని కోరారు. దానికితోడు, దేశానికి హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేసి, ఉభయ రాష్ట్రాలకు శాశ్వత ఉమ్మడి రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కానీ, ఆ డిమాండ్లను దిగ్విజయ్ సింగ్ పూర్తిగా తోసిపుచ్చే విధంగా మాట్లాడారు. సిఎన్ఎన్ -ఐబియన్ కార్యక్రమంలో హైదరాబాద్ భవిష్యత్తుపై ఆయన కాస్తా స్పష్టంగానే మాట్లాడారు. పదేళ్ల పాటు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉంటుందని, కాలంలో హైదరాబాదులోని శాంతిభద్రతలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయని చెప్పారు. దానికితోడు, పదేళ్ల తర్వాత తెలంగాణలో హైదరాబాద్ పూర్తిగా అంతర్భాగమవుతుందని చెప్పారు.

పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి సీమాంధ్ర నాయకులు పలువురు చిరంజీవి డిమాండ్‌నే కేంద్రం ముందు పెడుతున్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోలేమని పూర్తిగా అర్థమైన తర్వాత హైదరాబాదుపై సీమాంధ్ర నాయకులు పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెసు అధిష్టానం కూడా చాలా తెలివిగానే వ్యవహరించింది.

హైదరాబాద్‌పై బేరసారాలు చేసుకోవడానికి తగిన వెసులుబాటును కల్పిస్తూ రాష్ట్ర విభజన ప్రకటనను కాంగ్రెసు అధిష్టానం చేసింది. అంటే, రాష్ట్ర విభజన విషయంలో ఓ మెట్టు పైకి ఎక్కడానికి తగిన వెసులుబాటును కాంగ్రెసు అధిష్టానం కూడా కల్పించుకుంది. మొత్తం మీద, సీమాంధ్ర నాయకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుందనే భావన వ్యక్తమవుతోంది.

English summary
Congress high command leader and Andhra Pradesh affairs incharge Digvijay Singh has rejected Chiranjeevi's proposal on Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X