సీతయ్య తీరే వేరు: పసుపు చొక్కాకు సలాం

పార్టీకి సంబంధించిన లేదా రాజకీయ కార్యక్రమం అయితే ఆయన వస్త్రధారణలో మార్పు వుండదు. తన రాజీనామాను ఆమోదింపజేసుకున్న తర్వాత సభ నుంచి నేరుగా తన క్వార్టర్‌కు వెళ్లిన సాయంత్రం ఢిల్లీలో జరిగిన సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి పార్టీ మార్కు దుస్తుల్లో కాకుండా తెలుపురంగు దుస్తులు ధరించి హాజరయ్యారు.
సీమాంధ్రుల దీక్షకు ‘పసుపు' రంగును పక్కనపెట్టి తెల్లని చొక్కాతో పాటు తెల్లరంగు కండువాను ధరించడం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో ఈ విషయాన్ని గమనించిన సీమాంధ్ర ఉద్యోగులు కాస్త ఆలోచనలో పడ్డారని సమాచారం. అంతేకాదు దీన్ని పసిగట్టిన పలువురు రాజకీయ నాయకులు కూడా హరికృష్ణ పార్టీకి దూరమవుతున్నారనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు.హరికృష్ణ వ్యవహారశైలి కూడా ఇదే విధంగా వుండడంతో ఈ సంకేతాలు మరింత స్పష్టంగా బయటపడ్డాయి.
ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు హరికృష్ణకు మధ్య అంతరం పెరిగిన సంగతి తెలిసిందే. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పించడంలేదని హరికృష్ణ భావించడంతో ఆయన పూర్తిగానే చంద్రబాబుకు దూరం కావాలని అనుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications