దుమారం: వైయస్ షర్మిల క్రిస్టియన్ కాదా?

రాజమ్రండి ఘాట్ వద్ద గోదావరికి కొబ్బరికాయలు కొట్టడం, పూజలు చేయడం మతాన్ని కించపరచడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఆస్తులను కాపాడుకోడానికి, అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కుంచుకునేందుకు దైవభక్తిని, ఆధ్యాత్మిక పవిత్రతను అపవిత్రం చేస్తున్నారని మత్తయ్య విమర్శించారు.
క్రైస్తవులుగా చెప్పుకుంటూ క్రైస్తవ ఆస్తులను కబ్జా చేస్తూ క్రైస్తవత్వానికి దోహం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. షర్మిల పూజలతో పుణ్య నది అపవిత్రం పాలయిందని, హిందూ సోదరులు ఆ ప్రదేశాన్ని శుద్ది చేయాలని ఆయన సూచించారు. షర్మిల పాదయాత్రలో క్రైస్తవులు పాల్గొనరాదని మత్తయ్య సూచించారు.
వైయస్ విజయమ్మ ఎక్కడికి వెళ్లినా బైబిల్‌ను చేతిలో పట్టుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే పెద్ద రాద్దాంతం చేశారు. తాజాగా, క్రైస్తవ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ముత్తయ్య వైయస్ విజమయ్మ, షర్మిలలపై మండిపడ్డారు. షర్మిల భర్త అనిల్ కుమార్ క్రైస్తవ మత ప్రచారకుడనే విషయం అందరికీ తెలిసిందే.












Click it and Unblock the Notifications