జూ. ఎన్టీఆర్: అసలు వదిలేసి కొసరు..

Jr Ntr
హైదరాబాద్: తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండి అన్నట్లుంది బాద్‌షా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం. ఫ్లెక్సీల్లో తన బొమ్మను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వాడుకోవడంపై జూనియర్ ఎన్టీఆర్ అసలు వదిలేసి కొసరు వడ్డించారు. తాను తెలుగుదేశం పార్టీలో ఉంటానని, తనలో ప్రవహిస్తోంది నందమూరి వంశం రక్తమని భారీ డైలాగులు చెప్పిన ఆయన ఇతర పార్టీలు తన బొమ్మను వాడుకోవడంపై మాట్లాడలేదు. తన బొమ్మను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వాడుకోవడాన్ని ఖండించలేదు. అలా వాడుకోవద్దని చెప్పలేదు.

పైగా, తనను వివాదాల్లోకి లాగవద్దని, ప్రతిసారీ తాను వివరణ ఇవ్వబోనని వివాదాన్ని వివాదానికి వదిలేసి, తన తెలివిగా తప్పుకున్నాడు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు తన బొమ్మను వాడుకోవడానికి ఆయన పచ్చజెండా ఊపినట్లయింది. ఓ కళాకారుడిగా తనకు అన్ని పార్టీల్లోనూ అభిమానులు ఉంటారని అన్యాపదేశంగా చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ తేల్చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారంతో అసలు విషయాన్ని తేల్చేయాల్సిన బరువు బాబాయ్ బాలకృష్ణపై పడింది. లేదంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై పడింది. జూనియర్ ఎన్టీఆర్‌తో పార్టీకి సంబంధం లేదని ప్రకటించడం తప్ప మరో విధంగా వ్యవహరించడానికి వీలు లేకుండా పోయింది. అయితే, అందులో కూడా ఓ చిక్కుంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని చెప్పడం వల్ల ఆ చిక్కు వచ్చి పడింది. జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమీ అనలేదని పరిస్థితి ఏర్పడింది.

జూనియర్ ఎన్టీఆర్ బొమ్మల వివాదం చెలరేగుతుండగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్టీ రామారావు బొమ్మల వివాదాన్ని ముందుకు తెచ్చింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు బొమ్మలను వాడుకోవద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో మేరకు చెప్పగలరు, జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలను వాడుకోవద్దని చెప్పడం ఎలా అనేది వారికున్న సందిగ్ధత. ఏమైనా, వ్యవహారం పూర్తిగా తెలుగుదేశం పార్టీ చేతులు దాటిపోయే విధంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+