'సమం'కు జగన్ చెల్లు: కిరణ్ తెగింపు, చిరు సైడ్!

విభజనపై కాంగ్రెసు పార్టీ నిర్ణయం నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ఇరువురు పోటాపోటీగా సీమాంధ్రలో ఇమేజ్ కోసం తాపత్రయపడుతున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు. విభజన తథ్యమని తేలడంతో కిరణ్ వ్యక్తిగత ఇమేజ్, జగన్ వ్యక్తిగత, పార్టీ ఇమేజ్‌ని సీమాంధ్రలో పెంపొందించే పనిలో పడ్డారంటున్నారు. అందులో భాగంగానే జగన్ దీక్ష, కిరణ్ దూకుడు వ్యాఖ్యలు అంటున్నారు.

సిడబ్ల్యూసి నిర్ణయం కంటే ముందే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు పలువురు సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేశారు. ఆ తర్వాత కూడా ఆ పార్టీ పరోక్షంగా సమైక్యవాదాన్ని ఎత్తుకుంది. విభజనతో సమన్యాయం లేదా సమైక్యవాదం అంటూ ఆ పార్టీ సీమాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకుంటోంది. అయితే, ఆదివారం ఆ పార్టీ అనూహ్యంగా మరో టర్న్ తీసుకుంది. రేపటి నుండి షర్మిల బస్సుయాత్ర చేపట్టనున్నారు.

Kiran versus Jagan in Seemandhra

ఈ యాత్రకు ఆ పార్టీ సమైక్య శంఖారావం అని పేరు పెట్టింది. ఇంతవరకు సమన్యాయం లేదా సమైక్యవాదం అన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పుడు తమది సమైక్యవాదమని చెప్పింది. ఢిల్లీ పెద్దలకు ఇచ్చినట్లుగా తాము సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆదివారం లేఖ రాశారు. అంతకుముందే జగన్ జైల్లో దీక్ష చేశారు. ఉస్మానియాలోను తన దీక్షను కొనసాగించారు. నిమ్స్‌లో ఆయన దీక్షను బలవంతంగా భగ్నం చేశారు. సమైక్యవాదం ద్వారా తెలంగాణను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వదిలేసుకొని సీమాంధ్రలో పొలిటికల్ మైలేజ్ కోసం చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.

మరోవైపు, కిరణ్ సమైక్యవాదంపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సిడబ్ల్యూసి నిర్ణయం తర్వాత పది రోజులకు బయటకు వచ్చి అధిష్టానానికే ప్రశ్నలు కురిపించిన కిరణ్... ఆ తర్వాత పలుసందర్భాలలో సమైక్యవాణి వినిపించారు. విభజనపై ఎలాగు నిర్ణయం జరిగినందున కొత్త ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) రాష్ట్రంలో తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకే కిరణ్ ఇలా అధిష్టానంపైనే దూకుడుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

సీమాంధ్రలో హీరో అయ్యేందుకు ఆయన అధిష్టానాన్ని ధిక్కరించేలా తెగింపు వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలు జగన్, కిరణ్‌లతో పోటీ పడలేకపోతున్నారని అంటున్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని బొత్స చెబుతున్నారు. చిరంజీవి ఢిల్లీకే పరిమితమయ్యారు. ఆయన సమైక్యాంధ్ర కోసం ప్రయత్నిస్తున్నామని చెబుతూ తప్పదంటే హైదరాబాదును యూటి చేయాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. దీంతో సమైక్యవాద పోటీలో కిరణ్, జగన్‌లు మాత్రమే పోటాపోటీగా ఉన్నారని, చిరు, బొత్సలు లేరని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+