అరెస్ట్‌తో లింక్: జగన్ బెయిల్ విజయసాయి చేతిలో!

YS Jagan - Vijaya Sai Reddy
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ అంశాన్ని సిబిఐ ఆయన ఆడిటర్ విజయ సాయి రెడ్డి అరెస్టుతో లింక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయట. గతంలో జగన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు.. సిబిఐకి గడువు విధించిన సుప్రీం కోర్టు ఆ గడువు తర్వాతే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జగన్‌కు సూచించింది. సుప్రీం ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా సిబిఐ జగన్ కేసులో కీలకమైన ఐదో ఛార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉంది.

ఇప్పటికే నాలుగు ఛార్జీషీట్లు దాఖలు చేసిన సిబిఐ నెలాఖరులో ఐదో ఛార్జీషీట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఐదో ఛార్జీషీట్ దాఖలు తర్వాత జగన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశముంది. అయితే, అంతకుముందు ఛార్జీషీటుకు ముందే సిబిఐ జగన్ బెయిల్‌కు విజయ సాయి రెడ్డి అరెస్టుతో కొలికి పెట్టనుందట. కీలకమైన ఐదో ఛార్జీషీటు దాఖలు చేయాలంటే ఈ కేసులో కీలక పాత్రదారి విజయ సాయి బయట ఉండవద్దని, ఆయన అరెస్టుకు అవకాశమిస్తేనే ఛార్జీషీట్ దాఖలు చేసేందుకు వీలవుతుందని చెప్పనుందట.

విజయ సాయి బయట ఉండగా ఛార్జీషీటు దాఖలు చేస్తే అతను సాక్ష్యులను బెదిరించడమో, ప్రభావితం చేయడమో జరిగే అవకాశాలు ఉన్నాయని, తద్వారా కేసు తారుమారవుతుందని, అందుకే ఆయనను అరెస్టు చేస్తే ఛార్జీషీటు దాఖలు చేసేందుకు వీలుగా ఉంటుందని సిబిఐ చెప్పే అవకాశముంటుందని అంటున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో విజయ సాయి కూతురు పెళ్లి ఉంది. ఈ సమయంలో విజయ సాయి రెడ్డి ఏం చేస్తారనే అంశం ఆసక్తి రేపుతోంది. విజయసాయి చేతిలోనే జగన్ బెయిల్ దరఖాస్తు ఆధారపడి ఉందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+