తీర్పు: భార్య, స్నేహితురాలితో సమానంగా గడపాలి
భోపాల్: ఒకే ఇంట్లో నివసిస్తున్న భార్యకు, సహజీవనంన చేస్తున్న మహిళకు పదిహేను రోజుల చొప్పున కేటాయించాలని మధ్యప్రదేశ్ లోక్ అదాలత్ ఓ వ్యక్తిని ఆదేశించింది. సహజీవనం వివాదానికి సంబంధించి తమ వద్దకు వచ్చిన ఫిర్యాదుపై లోక్ అదాలత్ అసాధరణ తీర్పు ఇచ్చింది.
భార్యతో పదిహేను రోజులు, స్నేహితురాలితో మిగతా పదిహేను రోజులు గడపాలని లోక్ అదాలత్ సదరు వ్యక్తిని ఆదేశించింది. తన భర్త రెండేళ్లుగా తనతో కొద్ది సమయం కూడా గడపడం లేదని, అతనితో సహజీవనం చేస్తున్న మహిళకే తన సమయాన్నంతా కేటాయిస్తున్నాడని ఓ మహిళ లోక్ అదాలత్‌ను ఆశ్రయించింది.

కేసు విచారించిన న్యాయమూర్తి గంగా చరణ్ దూబే ఇద్దరికీ సమానంగా సమయం కేటాయించాలని, నెలలో పదిహేను రోజులు భార్య వద్ద, మిగతా పదిహేను రోజులు సహజీవన భాగస్వామితో గడపాలని శనివారం తీర్పు వెలువరించారు. పరస్పర అంగీకారంతో ఒకే ఇంటిలో జీవించవచ్చని కూడా సూచించింది. సదరు వ్యక్తికి ఉన్న మూడు గదుల ఇంట్లో మధ్యగదిలో అతను, చెరోగదిలో భార్య, స్నేహితురాలు విడివిడిగా ఉండవచ్చని అన్నారు.
ఓంకారేశ్వర్‌లో విద్యుత్తు సంస్థలో ఉద్యోగిగా పని చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగికి మూడు గదుల ఇల్లు ఉంది. ఇతని కేసు పైనే లోక్ అదాలత్ తీర్పు చెప్పింది. తాజా ఒప్పందం ప్రకారం అతను మధ్య గదిలో, మిగిలిన రెండు గదుల్లో భార్య, సహజీవనం చేస్తున్న మహిళ ఉంటారు.












Click it and Unblock the Notifications