వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓవైసీలకో న్యాయం, దానానికి మరో న్యాయమా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Danam Nagender - Asaduddin Owaisi
హైదరాబాద్: చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వ పెద్దలు సౌమ్యంగా చెబుతున్నారు. పటాన్‌చెరులో అప్పటి కలెక్టర్‌పై దుర్భాషలాడిన కేసులో ఓవైసీ సోదరులను పోలీసులు అరెస్టు చేశారు. మజ్లీస్ నేతలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలను పోలీసులు అరెస్టు చేశారు. మరి, మంత్రి దానం నాగేందర్ విషయంలో ఆ పని ఎందుకు చేయడం లేదనేది ప్రశ్న. ఓవైసీలపై చర్యల విషయంలో, తెలుగుదేశం పార్టీ నేతల అరెస్టు విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న పోలీసులు దానం నాగేందర్ మీద ఎందుకు ఉపేక్ష వహిస్తోందనే సందేహం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.

టీవీ చానెల్ ప్రతినిధుల సమక్షంలో కొంత కాలం క్రితం మంత్రి దానం నాగేందర్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను దుర్భాషలాడారు. మరి, దానం నాగేందర్‌ను వదిలేయడం ఏమిటనేది ప్రశ్న. కేసులు బనాయించి, చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని చెబుతున్న పెద్దలు దానం నాగేందర్ విషయంలో ఏం మాట్లాడుతారని అడిగితే అది తప్పేలా అవుతుందని అడగాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

నిరుడు ఆగస్టు 9వ తేదీన దానం నాగేందర్ బంజారాహిల్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ బి రమేష్‌పై నోరు చేసుకున్నారు. రమేష్ ఫిర్యాదుతో దానం నాగేందర్‌పై కేసు నమోదు చేశారు. మంత్రిగారి ప్రవర్తనపై పోలీసులు వీడియో సాక్ష్యాలను కూడా సేకరించారు. అయితే, కేసు ఇంకా దర్యాప్తులో ఉందని పోలీసులు చెబుతున్నారట.

ఓవైసీ సోదరులనే కాకుండా పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు కోడెల శివప్రసాద రావు, వై. శ్రీనివాస రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పి. రామకృష్ణా రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. హత్య కుట్ర కేసులో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన ఉదంతం కూడా ఉంది. శ్రీరామ్ ముందస్తు బెయిల్‌ను పొందడంలో కృతకృత్యులయ్యారు. దానం నాగేందర్ విషయంలో ఇంకా ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాల్సే ఉంది.

English summary
While the police say that they have not been influenced by the ruling party leaders in any of these arrests, they have no answers to questions about their inaction on Danam Nagender who abused a sub-inspector in the presence of scores of TV channel crew.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X