విచిత్రం: పార్టీ కష్టాలు కలెక్టర్‌కి చెప్పుకున్నటిడిపి!

రైతుల సమస్యలు మొదలు బందరు పోర్టు వరకు పలు సమస్యలను వారు అందులో ఏకరువు పెట్టారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని కోరారు. జిల్లా సమస్యలతో పాటు వారు పార్టీ సమస్యను కూడా అందులో ప్రస్తావించడటం విశేషం. ఇది చూసిన మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
దీనిని తెలుగుదేశం పార్టీ నేతల దృష్టికి తీసుకు వెళ్లారు. దానిని చూసిన తెలుగు తమ్ముళ్లు ఇదెలా జరిగిందంటూ.. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. జిల్లా సమస్యలతో పాటు గ్రామస్థాయిలో పార్టీని పటిష్ట పరిచి స్థానిక సంస్థ ఎన్నికలలో గెలుపుకు కృషి చేయాలని అందులో కోరారు.
అంతేకాదు ఆవనిగడ్డ, పెనుమలూరు తదితర నియోజకవర్గాలకు ఇంఛార్జులను నియమించాలని విజ్ఢప్తి చేశారు. వినతిపత్రంలోని విచిత్రాలను మీడియా ప్రతినిధులు తమ దృష్టికి తెచ్చాక, వాటిని గుర్తించిన తెలుగు తమ్ముళ్లు ఆ తర్వాత వాటిని తొలగించి కలెక్టర్‌కు మరో వినతి పత్రం ఇచ్చారు.












Click it and Unblock the Notifications