'బలవంతపు సంసారంపై మీ భార్యల్ని అడగండి'

Ponnam Prabhakar and Gutta Sukhender Reddy
న్యూఢిల్లీ: సంసారమైనా, వ్యాపారమైనా బలవంతంగా చేయడమంటే.. దానిని ఏమంటారో మీ భార్యలను అడిగి చెప్పాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డిలు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల పైన గురువారం మండిపడ్డారు. వారు ఎపి భవన్లో మాట్లాడారు.

విభజనకు అనుకూలంగా కాంగ్రెసు వర్కింగ్ కమిటీ నిర్ణయం చేశాక దానిని అడ్డుకుంటామని, విభజన జరగదని సీమాంధ్ర ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్‌లు వ్యాఖ్యానించడం సిగ్గుచేటు అన్నారు. పార్టీ నిర్ణయంపై గౌరవం లేకుండా ధిక్కార ధోరణితో వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

గురువారం లోకసభలో తాము ఉండవల్లి ప్రసంగాన్ని అడ్డుకోలేదని చెప్పారు. వాస్తవాలు చెప్పాలని మాత్రమే అడిగామన్నారు. ఇందిరా గాంధీ వ్యాఖ్యలను చెబుతున్న ఉండవల్లిని జవహర్ లాల్ నెహ్రూ, సోనియా గాంధీల వ్యాఖ్యలను కూడా చెప్పాలని తాము సభలో అడిగామన్నారు.

దేశాన్ని ఉద్దరించడానికే పుట్టినట్లుగా సీమాంధ్ర ఎంపీలు వ్యవహరిస్తున్నారని, వారి దొంగ నాటకాలను కట్టిపెట్టాలన్నారు. ఎపిఎన్జీవోల సభకు అనుమతివ్వడం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్వేషాలను మరింత పెంచుతున్నారని ఆరోపించారు. హైదరాబాదులో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులు విభజనను సమర్థించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+