వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిల పాదయాత్ర వాయిదా వ్యూహాత్మకమే?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sharmila
హైదరాబాద్‌: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్రను వ్యూహాత్మకంగానే వాయిదా వేసినట్లు ప్రచారం సాగుతోంది. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న షర్మిల విశ్రాంతి పేరుతో పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. నిజానికి, శస్త్రచికిత్స తర్వాత పాదయాత్ర చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా అందుకు సిద్ధపడడం లేదని అంటున్నారు. వైయస్ జగన్ వ్యూహంలో భాగంగానే ఆమె పాదయాత్రను వాయిదా వేసినట్లు చెబుతున్నారు.

పైగా, ఆమె పాదయాత్ర వాయిదా పడిందని బయటకు చెబుతున్నప్పటికీ మొత్తంగానే రద్దు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత ఆమె తన పాదయాత్రను ఆపేశారు. తెలంగాణపై అఖిల పక్ష సమావేశం నేపథ్యంలో పార్టీ వైఖరిపై తీవ్రమైన వ్యతిరేకత ఎదురు కావచ్చుననే ఉద్దేశంతో షర్మిల పాదయాత్రను ఆపించినట్లు చెబుతున్నారు. అఖిల పక్షం వేడి వల్ల తెలంగాణలో షర్మిల పాదయాత్రకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురు కావచ్చునని జగన్ అనుమానించినట్లు చెబుతున్నారు.

దానికితోడు, పాదయాత్ర చేస్తే ప్రజల్లో షర్మిలను చూడాలనే ప్రజల ఆసక్తి పూర్తవుతుందని, తర్వాత ప్రచారానికి వెళ్తే అంతగా ఆసక్తి ఉండకపోవచ్చునని అనుకున్నారట. వచ్చే ఎన్నికల్లో షర్మిలను స్టార్ కాంపెయినర్‌గా దించేందుకు వీలుగానే పాదయాత్రను రద్దు చేయించినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ జైలు నుంచి ఈ నెలాఖరులోగా బయటకు వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. బయటకు వచ్చిన తర్వాత జగన్ ప్రజల్లోకి వెళ్తారని, అందువల్ల ఇద్దరి శక్తులనూ ఒకేసారి వినియోగించడం సరి కాదని భావించినట్లు చెబుతున్నారు.

జగన్ ప్రజల్లోకి వెళ్తే, షర్మిల ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతారని అంటున్నారు. దానివల్ల షర్మిలపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని వాడుకోవచ్చునని భావిస్తున్నట్లు చెబుతున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నమ్ముతోంది. అందువల్ల తక్కువ వ్యవధిలో రెండుసార్లు పర్యటనలు అనవసరమని అనుకున్నారట.

English summary
It is said that YSR Congress party president YS Jagan's sister Sharmila's padayatra has been put off as an election strategy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X