వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజకీయ చిత్రంలో రతినిర్వేదం నటి శ్వేతా మీనన్

శ్వేతా మీనన్ తమిళంలో ఓ సినిమా చేయనుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు భాగ్యరాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 'తురై మొదలవర్' పేరిట ఈ చిత్రాన్ని ఆయన రూపొందిస్తున్నాడు. సమకాలీన భారత రాజకీయాలపై వ్యంగ్యాస్త్రంగా తెరకెక్కే ఈ సినిమాలో భాగ్యరాజా సరసన శ్వేతా కథానాయికగా నటిస్తోంది.
ఆమె పోషించే పాత్ర చర్చకు దారి తీస్తుందని అంటున్నారు. ఒకవేళ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన పార్లమెంటు సభ్యుడిని ఈ సినిమాలోకి లాగుతారా అన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
కథ నచ్చడం వల్లే శ్వేతా ఇందులో నటించడానికి వెంటనే ఒప్పుకుందట. సంచలనాత్మక పాత్రలు పోషించడానికి శ్వేతా పెట్టింది పేరు. ఆమధ్య 'కలిమన్ను' అనే మలయాళ సినిమాలో నిజప్రసవ దృశ్యాలలో నటించి ఆమె సంచలనం సృష్టించింది.