ఐపిఎలే కాదు: జగన్ కేసు రింగ్‌లో శ్రీనివాసన్?

YS Jagan - Srinivasan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తప్పనిసరిగా అరెస్టు చేయాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారట. జగన్ కేసును సిబిఐ దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ కంపెనీలలో ఇండియా సిమెంట్స్ పెట్టుబడులు పెట్టినట్లుగా అభియోగాలు ఉన్నాయి. ఇండియా సిమెంట్స్ యజమాని బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్.

ఈ నేపథ్యంలో జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన ఇండియా సిమెంట్స్ యజమాని శ్రీనివాసన్ అరెస్టు కావాల్సి ఉందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారని ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో కథనం వచ్చింది. క్విడ్ ప్రోకో కింద జగన్ కంపెనీలలో ఇండియా సిమెంట్స్ జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిందనే అభియోగాలు ఉన్నాయి. జగన్ కేసులో ఇండియా సిమెంట్స్‌కు సంబంధించిన అంశం దాదాపూ పూర్తయిందని, మరికొన్ని సాక్ష్యాలను మాత్రమే సేకరించాల్సి ఉందని సిబిఐ చెబుతోంది.

మరోవైపు జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టి ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్‌ను అరెస్టు చేయాలని, ఆయన సాక్ష్యులను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారట. శ్రీనివాసన్‌ను అరెస్టు చేసిన తర్వాత కేసును విచారించాలని చెబుతున్నారట. లేదంటే ఆయన సాక్ష్యులను ప్రభావితం చేయగలరని చెబుతున్నారని వార్తను రాసింది.

క్విడ్ ప్రోకోతో ఇండియా సిమెంట్స్ జగన్ కంపెనీలలో రూ.140 కోట్ల పెట్టుబడులు పెట్టిందని, ప్రతిగా ఆ కంపెనీకి లబ్ధి చేకూరిందని సిబిఐ డిఐజి వెంకటేష్ చెప్పారు. కాగ్నా, కృష్ణా నదుల నుండి నీటిని వినియోగించుకునేందుకు ఇండియా సిమెంట్స్‌కు అనుమతి లభించిందట. ఇండియా సిమెంట్స్‌కు భారతి సిమెంట్ మార్కెట్లో పోటీదారు. అలాంటి పోటీదారుకు చెందిన జగన్ కంపెనీలలో ఇండియా సిమెంట్స్ కంపెనీ పెట్టుబడులు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+