బుకీ కూతురితో సురేష్ రైనా, మురళీ విజయ్

చెన్నై బుకీ ప్రశాంత్ కూతురితో సురేష్ రైనా, విజయ్ ఫొటోలు వెలుగు చూశాయి. ఐపియల్ మ్యాచుల తర్వాతి పార్టీలు సాధారణంగా కొద్ది మందికి మాత్రమే పరిమితమవుతాయి. ఆ పార్టీలో ఆ బుకీ కూతురు కనిపిస్తూ ఉండేది. ఆమెకు కొంత మంది క్రికెటర్లతో మంచి సంబంధాలున్నాయని అంటున్ారు.
చెన్నై సూపర్ కింగ్స్ యజమాని గురునాథ్ ఎవియం కుటుంబానికి చెందినవాడు. అతనికి తమిళ సినీ పరిశ్రమతో మంచి సంబంధాలున్నాయి. దీంతో చాలా మంది సినీ తారలు పార్టీలకు హాజరయ్యేవారు. తొలి ఐపియల్ సందర్భంగా సినీ నటి లక్ష్మీరాయ్ మహేంద్ర సింగ్ ధోనీ బైక్‌పై కనిపించింది. తర్వాత ఆమె శ్రీశాంత్‌తో కలిసి ఫొటో షూట్‌లో పాల్గొంది.
పాకిస్తాన్ అంపైర్ అసద్ రవూఫ్ ఉదంతంతో క్రికెట్ కుదేలైందని అంపైర్ డికీ బర్డ్ వ్యాఖ్యానించాడు. ఫిక్సింగ్‌లో రవూఫ్ పాత్ర ఉన్నట్లు రుజువైతే అతన్ని ఎన్నడూ అంపైరింగ్‌కు అనుమతించరాదని అన్నాడు.












Click it and Unblock the Notifications