పార్టీల్లో సాక్షితో ఎంజాయ్: శ్రీ ఫోన్ ఎందుకిచ్చాడు?

ఈ సందర్భంగా శ్రీశాంత్ తన ఖరీదైన్ ఫోన్‌ను సాక్షి జాలాకు ఇచ్చాడట. తన ఇంటికి విందుకు వచ్చిన శ్రీశాంత్ ఆ ఫోన్‌ను తన కూతురుకు బహుమతిగా ఇచ్చాడని సాక్షి జాలా తండ్రి అతుల్ చెబుతున్నాడు. అతడు రైల్వే పర్యాటక శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. శ్రీశాంత్ ఫోన్ ఇచ్చినందుకు బదులుగా తాము పులి పోస్టర్‌ను శ్రీశాంత్‌కు బహుమతిగా ఇచ్చామని అతడు పోలీసులకు తెలిపాడు. జైపూర్‌లో ఐపిఎల్ మ్యాచ్‌ల తర్వాత సాక్షి జాలాతో కలిసి శ్రీశాంత్ పార్టీలకు హాజరయ్యేవాడట.
ఒక్క మ్యాచ్ పైన రూ.500 కోట్ల బెట్టింగ్
ఐపిఎల్ 6 స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో మరో కొత్త కోణం బయటపడింది. చెన్నైలో అరెస్టైన బుకీ ప్రశాంత్‌కు పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులతో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం. ప్రశాంత్‌ను ప్రశ్నించారు. విచారణలో ఆయన కళ్లు చెదిరే వాస్తవం చెప్పాడట. బెట్టింగులో ఉత్తరాది వారితో కలిసి 150 మంది పాల్గొన్నట్లు చెప్పాడట.
కాగా మే 6న చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రూ.360 కోట్ల నుంచి రూ.500 కోట్ల సొమ్ము బెట్టింగ్ చేతులు మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టైన అజిత్ చండిలకు బుకీల నుంచి వేర్వేరు దఫాలుగా రూ.49 లక్షలు ముట్టినట్లుగా పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications