రాధాకృష్ణ Vs కెటిఆర్: జగన్ పార్టీ సపోర్ట్!?

టిడిపి గురించి ఏం మాట్లాడాలో జగన్ పార్టీ నేతలకు ధర్మాన ప్రసాద రావు ట్యూషన్ చెప్పారని, అలాగే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రాంప్టింగ్... కెటిఆర్ యాక్టింగ్ సాగిందని ఆరోపించారు. కాంగ్రెసుకు తోక పార్టీల్లాంటి ఈ రెండు ఎ, బి జట్టులా మారాయని ఎద్దేవా చేశారు. కెటిఆర్ తండ్రి, తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉత్తరాంధ్ర నుంచి వచ్చారని, ఎంపి విజయశాంతి రాజమండ్రి నుంచి, పార్టీ జనరల్ సెక్రటరీ కేశవ రావు పశ్చిమ గోదావరి నుంచి వచ్చారని విమర్శలు గుప్పించారు.
మరోవైపు సెటిల్మెంట్ వ్యవహారంపై కెటిఆర్, ఆంధ్రజ్యోతిల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. తనపై అవాస్తవ కథనాలు ప్రసారం చేస్తున్నారని, వాటిపై కోర్టుకెక్కుతానని కెటిఆర్ హెచ్చరించగా.. ఇప్పుడే వెళ్లవచ్చునని ఆంధ్రజ్యోతి సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
తాజాగా 'కొత్త పలుకు'లో కెసిఆర్, కెటిఆర్‌ల పైన నిప్పులు చెరిగారు. పదమూడేళ్ల తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు అందరు త్యాగం చేశారని, కెసిఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం కెసిఆర్‌తో పుట్టలేదని, అంతకుముందే ఉందని చెప్పారు. చీమలు పెట్టిన పుట్టల్లో ఇప్పుడు పాములు చేరారన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి వేరు, తెలంగాణ ఉద్యమం వేరు అని తెలిపారు.
ఆచార్య జయశంకర్ లాంటి వారు ఉంటే ఎప్పుడో తెలంగాణ వచ్చేదని, కెసిఆర్ లాంటి వారి వల్లే తెలంగాణ ఆలస్యమైందని అభిప్రాయపడ్డారు. జయశంకర్ రెండో వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు కూడా కెసిఆర్‌కు సమయం చిక్కలేదా అని ప్రశ్నించారు. కెసిఆర్‌ను బ్యాడ్ లీడర్ ఫర్ గుడ్ కాజ్ అని అభివర్ణించారు. తన జీవితం తెలంగాణ కోసమే అన్న కెసిఆర్.. ఇప్పుడు తన కుటుంబం కోసమే తెలంగాణ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
తెలుగుదేశం పార్టీతో తమకు ముడి పెట్టడంపై కూడా ఘాటుగానే స్పందించింది. తాము తెలుగుదేశం పార్టీ తీరును తప్పుబట్టిన సందర్భాలను వివరించింది. తాము ఏ పార్టీని విడిచి పెట్టమని తెలిపింది. కెసిఆర్‌ను, తెరాసను ప్రశ్నిస్తే తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులుగా పేర్కొంటున్నారని, దీనిని ప్రజలు గుర్తిస్తున్నారని కానీ, ఏమైనా తెలంగాణ రాష్ట్రం వస్తే చాలని ప్రజలు ప్రస్తుతానికి మౌనంగా ఉంటున్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications