బిజెపితో వెళ్లి, కన్వీనర్‌నౌతా: కాంగ్‌కు కెసిఆర్ వార్న్

కెసిఆర్ సోమవారం తన ఫాంహౌస్‌లో, నివాసంలో, ఇటీవల కరీంనగర్‌లో జరిగిన ఓ విద్యార్థి నాయకుని వివాహ సమయంలోను ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట. కేంద్రం హైదరాబాదు పైన ఎలాంటి ఆంక్షలు లేని భాగ్యనగరంతో కూడిన పది జిల్లాల తెలంగాణను ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు.
ఏమైనా కిరికిరి పెడితే ఆ పార్టీకే నష్టమని హెచ్చరిస్తున్నారు. బిజెపి హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు అనుకూలంగా ఉందని, కాంగ్రెసు వెనక్కి తగ్గితే మనలాంటి వాళ్లు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి జై కొడితే దక్షిణ భారతంలోను ఎన్డీయేకు బలం అనూహ్యంగా పెరుగుతుందని అంతర్గతంగా నేతలతో చెబుతున్నారట.
కాంగ్రెసు అటు ఇటు చేస్తే మనం బిజెపి వైపు అడుగేస్తే ఎన్డీయే కన్వీనరు కూడా అవుతానని, కేంద్ర ప్రభుత్వంలో ముందు వరుసలో ఉంటామని చెబుతున్నారట. సంపూర్ణ తెలంగాణ ఇస్తే సరి. లేదంటే బిజెపితో జట్టు కట్టేందుకు వెనుకాడనని ఓ కాంగ్రెసు నాయకుడికి తాను చెప్పినట్లుగా కెసిఆర్ నేతలతో వ్యాఖ్యానిస్తున్నారట. ఆంక్షలు పెట్టి విలీనం గురించి అడిగితే ఎలా అని, పునర్నిర్మాణంలో తెరాస పాత్ర ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications