జగన్ ఇక దూసుకెళ్తారా: బెయిల్‌కోసం మంత్రాంగం?

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం తెర వెనుక మంత్రాంగం జరుగుతోందా అంటే కావొచ్చుననే వార్తలు వస్తున్నాయి. జగన్ బయటకు వస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండటం, బెయిల్ వస్తుందని ఆ పార్టీకి ఎలా తెలుసునని తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం డీల్ అంటూ ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. కథనం ప్రకారం...

జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ ఇప్పటికి 8 చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇక రెండు మూడు అంశాలపై వారంలోపే అభియోగపత్రాలు దాఖలు చేయనుంది. దీంతో దర్యాప్తు ముగిసినట్లే. చివరి చార్జిషీట్ దాఖలు కాకమునుపే, బుధవారమే జగన్ బెయిల్ కోసం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీం కోర్టుకు సిబిఐ చెప్పిన ప్రకారం దర్యాప్తు ముగిసినందున తనకు బెయిల్ ఇవ్వాలని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సిబిఐ ఏ స్థాయిలో వ్యతిరేకిస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మొత్తానికి చార్జిషీట్ల దాఖలు ప్రక్రియను సిబిఐ త్వరత్వరగా పూర్తిచేయడం వెనుక కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహం ఉందని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అయితే... మొన్నటిదాకా జగన్‌కు సిబిఐ కేసుల్లో బెయిల్ వచ్చినట్లయితే, వెంటనే ఈడి రంగంలోకి దిగుతుందని... జగన్‌ను అరెస్టు చేసి ఢిల్లీకి తరలిస్తుందని భావించేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదని చెప్పవచ్చు. జగన్ ఆస్తులను స్తంభింపచేస్తూ వచ్చిన ఈడి ఇప్పుడు మౌనముద్రలోకి వెళ్లి పోయింది. దాని దర్యాప్తు ఊసే వినబడడం లేదు.

'తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఒక్కటే' అంటూ టిడిపి చేసే ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే దీనిపై అనుమానాలు ఉన్నాయని... జగన్‌కు బెయిల్ వచ్చేస్తే ఆ అనుమానాలే నిజమని భావించాల్సి వస్తుందని సీమాంధ్ర సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారట.ఇక రాజకీయంగా చూస్తే... ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు సీమాంధ్రలో జనంలోకి వెళ్లలేకపోతున్నారు. సమైక్యంపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్న జగన్ బెయిలుపై బయటకు వచ్చాక జనంలోకి దూసుకుపోయేలా చేయడమూ అధిష్ఠానం వ్యూహంలో భాగమని భావిస్తున్నారు.

ఇప్పటికే యాత్ర చేస్తున్న షర్మిల తన విమర్శలను చంద్రబాబుకే పరిమితం చేయడం, విభజన నిర్ణయం తీసుకున్న సోనియాను పల్లెత్తు మాట అనకపోవడానికి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు నిశితంగా గమనిస్తున్నారు. "విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు జైలులో ఉన్న జగన్‌కు 15 రోజులు ముందుగానే తెలిసింది. అందుకు అనుగుణంగా ఆ పార్టీ నేతలు కార్యాచరణ రూపొందించుకున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ వ్యూహంలో భాగమే కావొచ్చు'' అని కొందరు కాంగ్రెస్ నేతలూ అభిప్రాయపడుతున్నారట.

మొత్తం మీద జగన్ అనే కత్తితో తమ పీకలు తెగ్గోయ డానికి అధిష్ఠానం సిద్ధమైందని వాపోతున్నారట. ఎన్నికల తర్వాత తమకు మద్దతు ఇస్తారనే జగన్‌ను ప్రోత్సహిస్తున్నారని... ఒకవేళ ఎన్నికల తర్వాత ఆయన 'చెయ్యిస్తే' పరిస్థితి ఏమిటని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+