వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బహిరంగంగా రాహుల్ గాంధీకి మహిళ ముద్దులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

A surprise kiss for Rahul Gandhi on his tour of Assam
గౌహతి: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి బుధవారం అస్సాంలో విచిత్ర అనుభవం ఎదురైంది. బుధవారం డాన్ బాస్కో విశ్వవిద్యాలయంలో విద్యార్థిని, విద్యార్థులతో రాహుల్ ముఖాముఖిగా మాట్లాడారు. అనంతరం స్వయం సహాయక గ్రూప్ మహిళళతో మాట్లాడారు. పలువురు మహిళలు వచ్చి రాహుల్‌తో కరచాలనం కోసం పోటీ పడ్డారు. ఈ సమయంలో ఓ మహిళ రాహుల్ చెంప, నుదుటి పైన ముద్దు పెట్టింది.

కాగా, అస్సాంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... మహిళల్లో అభద్రతా భావాన్ని తొలగించి స్వేచ్ఛగా జీవించేలా వీలు కల్పిస్తానని, అప్పుడే భారత్ అగ్రగామి దేశంగా అవతరిస్తుందని అన్నారు. భారత్‌ను సూపర్ పవర్‌గా తీర్చిదిద్దుతామని కొంతమంది ప్రకటిస్తున్నారని, అసలు సూపర్ పవర్ అంటే ఏమిటని ప్రశ్నించారు. మహిళలు బస్సుల్లో నిర్భయంగా ప్రయాణించేలా వీలు కల్పిస్తానని, అప్పుడే భారత్ సూపర్ పవర్‌గా అవతరిస్తుందని అన్నారు.

బస్సులో మీరు ఇబ్బంది లేకుండా ప్రయాణిస్తున్నారా? వీధుల్లో నడిచేటప్పుడు మీకు ఇబ్బందులేమైనా ఎదురవుతున్నాయా? అని డాన్ బాస్కో విశ్వవిద్యాలయ విద్యార్థినులను రాహుల్ ప్రశ్నించారు. యువతులు, మహిళలు కేవలం బస్సులో ప్రయాణించేందుకే భయపడుతుంటే భారత్ సూపర్ పవర్‌గా ఎదుగుతుందని మనకి మనం ఎలా చెప్పుకోగలమన్నారు. కకోలీ అనే ఒక విద్యార్థిని అడిగిన ప్రశ్నకు రాహుల్ ఈ విధంగా ప్రతిస్పందించారు.

మహిళలు అభద్రతా భావంతో జీవిస్తున్నారని, దేశ రాజకీయ వ్యవస్థలో వీరికి సముచితమైన ప్రాతినిధ్యం లభించడం లేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ జనాభాలో సగం మంది మహిళలే ఉన్నారని, వీరిని పురుషులు చులకనగా చూడటం నేటితో ఆగిపోవాలన్నారు. దీనిని గురించి అందరు ఆలోచించాలన్నారు. పురుషుల కంటే మహిళలు చురుకైన వారు, తెలివైనవారు, సమర్థవంతులు కూడా అన్నారు.

మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చే కుటుంబంలో జన్మించానని, అందుకే భావోద్వేగాన్ని ఆపుకోలేక మాట్లాడుతున్నానన్నారు. తన తండ్రి తనను, తన సోదరిని ఒకేలా చూసేవారని చెప్పారు. తమ కుటుంబ పెద్ద తమ నానమ్మ ఇందిరా గాంధే అన్నారు. దేశంలో సగం మంది మహిళలు.... అంతా తల్లులు, చెల్లెలు లాంటి వారన్నారు.

English summary
A kiss on the cheek, another on his head - it was a reception that Rahul Gandhi could not have anticipated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X