హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోనాలు: నాటుకోడి ధరలకు రెక్కలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో నాటు కోడికి ధరలకు రెక్కలు వచ్చాయి. బోనాల పండుగను ఆషాడ మాసంలో జరుపుతారు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు.

పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. దాంతో నాటుకోళ్లకు గిరాకీ పెరిగింది.

ఫామ్ కోళ్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. కానీ నాటుకోళ్లు దొరకడం కష్టంగా మారింది. ఈ స్థితిలో అమ్మవారిని సంతోష పెట్టడానికి నాటుకోళ్ల కోసం భక్తులు అర్రులు చాచారు. దాన్ని అదునుగా చూసుకుని వాటి ధరలను పెంచేశారు. ఒక్కో నాటు కోడి ధర కిలో 240 రూపాయలు పలికింది.

నాటుకోడి ధరలకు రెక్కలు

నాటుకోడి ధరలకు రెక్కలు

బోనాల పండుగ సందర్భంగా నాటుకోడికి హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో గిరాకి పెరిగింది. దాని ధరలకు రెక్కలు వచ్చాయి.

నాటుకోడి ధరలకు రెక్కలు

నాటుకోడి ధరలకు రెక్కలు

ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని నమ్ముతారు. దాంతో తమ ఇంటికి వచ్చిన అమ్మవారికి మాంసాహారం నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ. దాంతో కోడిని బలి ఇవ్వడం సంప్రదాయంగా మారింది

నాటుకోడి ధరలకు రెక్కలు

నాటుకోడి ధరలకు రెక్కలు

బ్రాయలర్ కోళ్లు, ఫామ్ కోళ్లు బాగానే దొరుకుతాయి గానీ అమ్మవారిని సంతోషపెట్టడానికి నాటు కోడి మంచిదనే అభిప్రాయం ఉంది. అందులోనూ పుంజు కావాలి.

నాటుకోడి ధరలకు రెక్కలు

నాటుకోడి ధరలకు రెక్కలు

హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో బోనాల పండుగకు విశేష ప్రాధాన్యం ఉంది. అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి బోనాలు ఎత్తుతారు.

English summary
Country hen prices increased during Mahankali jatara or Bonalu festival in Hyderabad and Secendurabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X