వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రాన్స్‌లేషన్‌లో దానం తప్పులు, రాహుల్ అసహనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించేందుకు శుక్రవారం మాజీ మంత్రి దానం నాగేందర్, కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణల మధ్య వాదులాట జరిగిన విషయం తెలిసిందే. సర్వేకు రాహుల్ గాంధీ నచ్చ జెప్పడంతో దానం అనువందించారు. అయితే.. రాహుల్ ప్రసంగాన్ని దానం పలుమార్లు తడబడ్డారు. ఆయన చెప్పనివి చెప్పారు. ఇది కొంత గందరగోళానికి దారి తీసింది.

శుక్రవారం రాత్రి హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెసు బహిరంగ సభ జరిగింది. ఈ సభలో రాహుల్ హిందీ ప్రసంగానికి దానం తెలుగులోకి అనువాదం చేశారు. రాహుల్ చెప్పిన కొన్ని అంశాలను అనువదించలేక దానం దాటవేశారు. మరికొన్నింటిని తప్పుగా చెప్పారు. ఇంకొంత సొంత కవిత్వం చెప్పారు.

Danam translates Rahul's speech

రాహుల్ ప్రసంగానికి మొదట్లో అనువాదం సాఫీగానే సాగింది. కాసేపటికి దానం తడబడ్డారు. సాఫ్ట్‌వేర్‌కు హైదరాబాద్ ప్రసిద్ధి అని.. ఇక హార్డ్‌వేర్‌ను అభివృద్ధి చేస్తామని రాహుల్ చెప్పగా.. దానం దానిని దాటవేశారు. హైదరాబాదులోని ఇతర ప్రాంత ప్రజలకు అండగా ఉంటామని రాహుల్ చెబితే... సీమాంధ్ర ప్రజలని దానం చెప్పారు.

అలాగే భూపరిహారం పెంచామని చెబితే.. తగ్గించామని, ఎంఎంటిఎస్ అభివృద్ధి అంటే.. రవాణా అని, మహిళల కోసం పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామనగా.. ఏర్పాటు చేస్తామన్నారు. ఓ చోట రాహుల్ మేడిన్ తెలంగాణ, మేడిన్ హైదరాబాద్ అంటూ.. ఆ రెండు బ్రాండ్లల గురించి చెప్పారు. దానం మాత్రం ఒక్క తెలంగాణ బ్రాండ్‌నే చెప్పారు.

రాహుల్‌కు తెలుగు అర్థం కాకపోయినప్పటికీ... తాను తెలంగాణ బ్రాండ్, హైదరాబాద్ బ్రాండ్ అని చెప్పినా, దానం ఒక్క తెలంగాణ బ్రాండ్ చెప్పి, హైదరాబాద్ అనే బ్రాండ్ చెప్పకపోవడం గుర్తించిన రాహుల్ కొంత అసహనానికి గురయ్యారు. రాహుల్ కల్పించుకొని మరీ హైదరాబాద్ బ్రాండ్ గురించి చెప్పాలని దానంకు సూచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, దానం ప్రసంగం సందర్భంగా పదే పదే చప్పట్లు అంటూ ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. అయితే, తన తడబాటు, పొరపాటు బయటపడకుండా ఉండేందుకే అలా ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారంటున్నారు.

English summary
Former minister Danam Nagender translates Rahul Gandhi's speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X