ముద్దులు పెట్టుకున్నారు: కేసుల్లో ఇరుక్కున్నారు
హైదరాబాద్: కొచ్చిలో తలపెట్టిన లవ్ కిస్ కార్యక్రమానికి మద్దతుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు) విద్యార్థులు ముద్దులు కురిపించుకుని, పోలీసు కేసుల్లో ఇరుక్కున్నారు. ముద్దులు కురిపించుకున్న విద్యార్థినీ విద్యార్థులపై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
బహిరంగంగా అశ్లీలతకు పాల్పడినందుకు పోలీసులు వారిపై కేసులు పెట్టారు. విశ్వవిద్యాలయం ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయ జనతా యువమోర్చా (బిజెవైఎం), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) కార్యకర్తలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.

ముద్దుల వ్యవహారంపై, అక్రమ ప్రవేశాలపై విశ్వవిద్యాలయం అధికార యంత్రాంగం సైబరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాలా మంది విద్యార్థులు ముద్దుల్లో మునిగిపోయారని, అది ప్రజలకు ఇబ్బంది కలిగించిందని విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అశ్లీల కార్యకలాపానికి పాల్పడినందుకు విద్యార్థులపై భారతీయ శిక్షాస్మృతిలోని 294 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు గచ్చిబౌలి పోలీసు ఇన్‌స్పెక్టర్ జె. రమేష్ చెప్పారు. నిందితులపై సాక్ష్యాలను సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. తమపై ఆరోపణలు చేసి పోలీసులు, విశ్వవిద్యాలయ అధికారులు తమపై మోరల్ పోలీసింగ్‌కు పాల్పడుతున్నారని విశ్వవిద్యాలయ విద్యార్థులు అన్నారు.
బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం అశ్లీలతనా అని అడుగుతూ ప్రేమను వ్యక్తం చేయడమని వారన్నారు. కేసులను చట్టపరంగా ఎదుర్కుంటామని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications