బిజెపి కాదా: లగడపాటి సైకిలెక్కుతారా?
విజయవాడ: విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ సైకిలెక్కే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో లగడపాట చర్చలు జరిపినట్లు సమాచారం. ఏలూరు సీటును రాజగోపాల్ ఆశిస్తున్నట్లు తెలిసింది.
లగడపాటి రాజగోపాల్ బిజెపి లేదా వైయస్సార్ కాంగ్రెసు లేదా టీడీపీల్లో ఏదో ఒక పార్టీలో చేరుతారనే ఊహాగానాలు గత కొన్నాళ్లుగా వినిపించాయి. ఇప్పటికే పలు రకాల సర్వేలను చేయించుకున్న లగడపాటి చివరకు తెలుగుదేశం వెైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. అయితే విజయవాడ ఎంపీ సీటును ఇచ్చేందుకు టీడీపి సిద్దంగా లేనందున ఆయనకు ఏలూరు లేదా నెల్లూరు సీటు ఇవ్వడానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

విజయవాడ సీటును ఇప్పటికే అక్కడ కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని శ్రీనివాస్(నాని)కి ఇవ్వడానికి నిర్ణయం జరిగిపోయింది. లగడపాటి రాజగోపాల్ ఏలూరు సీటును కోరు తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెడతారనే ఆశతో ఇప్పటివరకు రాజగోపాల్ ఎదురు చూశారు. సిఎం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ప్రత్యామ్నాయంపై వైపు దృష్టి సారించినట్లు చెబుతున్నారు.
లగడపాటి రాజగోపాల్ బిజెపితో కూడా ఇంకా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీతో కూడా మంతనాలు సాగిస్తున్నారని అంటున్నారు.. ఆయనకు ఏలూరు సీటును ఇచ్చేందుకు దేశం పార్టీ అదినేత చంద్రబాబు కూడా సుముఖత వ్యక్తం చేశారని, అయితే ఇప్పటికే అక్కడ నుంచి మాజీ మంత్రి మాగంటి బాబు పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. మాగంటి బాబును దెందులూరు నుంచి అసెంబ్లీ సీటుకు పోటీ చేయిస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications