టీడీపీ 'తీగల' వెళ్తే, బీజేపీ రోడ్డెక్కింది (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ టికెట్ పైన మహేశ్వరం నియోజకవర్గం నుండి శాసన సభ్యుడు తీగల కృష్ణారెడ్డి బుధవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, అంతకుముందు బీజేపీ స్థానిక కార్యకర్తలు నిరసన తెలిపారు.
తీగల కృష్ణా రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీ మారాలని సరూర్ నగర్ భారతీయ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
తీగల తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు బుధవారం ఆయన దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు.

తీగల దిష్టిబొమ్మ
ఎల్బీ నగర్ మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ కొత్తపేట కూడలి వరకు సాగింది. ఇందులో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. చావు డప్పులతో ర్యాలీ నిర్వహించారు. తీగల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తీగల దిష్టిబొమ్మ
తీగల దగాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని, తన నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని నినాదాలు చేశారు. స్వలాభం కోసం, తన మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం తెరాసలో చేరడానికి తీగల సంసిద్ధులయ్యారని ఆరోపించారు.

తీగల దిష్టిబొమ్మ
బంగారు తెలంగాణ కోసం ఏమాత్రం కాదని, కేసీఆర్ అంటే భయంతోనే కారు ఎక్కుతున్నారన్నారు. తీగల తన పదవికి రాజీనామా చేసి, తెరాసలో చేరి తిరిగి పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు.

తీగల దిష్టిబొమ్మ
మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు, బీజేపీ, టీడీపీలకే ఓట్లు వేశారన్నారు. వెంటనే ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో ఆయన కార్యక్రమాలను తాము అడ్డుకుంటామని, ఆందోళన చేస్తామన్నారు.

తీగల
మహేశ్వరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ పైన గెలుపొందిన తీగల కృష్ణా రెడ్డి బుధవారం సాయంత్రం తెరాసలో చేరారు.












Click it and Unblock the Notifications