బాబు: పురంధేశ్వరి కోసం బాలకృష్ణ ప్రయత్నాలు?

టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో పడక పోవడం వల్ల వారి టిడిపిని వీడి కాంగ్రెసులో చేరారు. ఇప్పుడు బాలయ్య సోదరిని తిరిగి పార్టీలోకి తీసుకు వచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో పురంధేశ్వరి కాంగ్రెసు పార్టీని వీడే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఆమె భారతీయ జనతా పార్టీలో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే, అనూహ్యంగా టిడిపిలోకి తెచ్చేందుకు బాలకృష్ణ ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారట. పురంధేశ్వరి మరోసారి విశాఖ నుండి పోటీ చేసేందుకు కాంగ్రెసు పార్టీలో ఇటీవలి వరకు టి సుబ్బిరామి రెడ్డితో మాటల యుద్ధానికి దిగారు.
టిఎస్సార్ రాజ్యసభకు వెళ్లడంతో ఆమెకు కాంగ్రెసు పార్టీలో విశాఖ నుండి పోటీ చేసేందుకు క్లియర్ అయింది. కానీ విభజన అంశంతో పార్టీని వీడేందుకే ఆమె మొగ్గు చూపుతున్నారంటున్నారు. అందుకు లోకసభలో ఆమె వెల్లోకి చొచ్చుకెళ్లడం, సీనియర్ నేతలు ప్రశ్నిస్తే వారికి ఘాటుగా సమాధానం చెప్పడం, దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజ్యసభ ఎన్నికల్లో తిరస్కార ఓటు హక్కును వినియోగించుకోవడాలు చూస్తుంటే పార్టీ వీడవచ్చుననే ప్రచారం సాగుతోంది.
బాలకృష్ణ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ కాకుండా తన నియోజకవర్గం ఉన్న విజయవాడ నుండి పోటీ చేయాలని కోరుతున్నారట. చంద్రబాబు, పురంధేశ్వరిల మధ్య సంధికుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే, ఇది ఎంత వరకు నిజమో లేక నిజమే అయితే పురంధేశ్వరి టిడిపిలోకి వస్తారా అనేది ప్రశ్నే.












Click it and Unblock the Notifications