బిజెపిలోకి పురంధేశ్వరి: మరో ముగ్గురు జంప్?

రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు చెందిన మరో ముగ్గురు కేంద్రమంత్రులు పార్టీ మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వీరితోపాటు కొందరు పార్లమెంటు సభ్యులు కూడా పార్టీ ఫిరాయిస్తారనే మాట వినిపిస్తోంది. సీమాంధ్రకు చెందిన ఒక కేంద్ర మంత్రి, ముగ్గురు సహాయ మంత్రులు బిజెపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిపోతారని తెలిసింది. సీమాంధ్రకు చెందిన ఒక మహిళా మంత్రి పురంధేశ్వరి ఇదివరకే బిజెపి నేతలతో మంతనాలు పూర్తి చేశారని అంటున్నారు. మరో మంత్రి వైయస్సార్ కాంగ్రెసు నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది.
సీమాంధ్రకు చెందిన ముగ్గురు పార్లమెంటు సభ్యులు తెలుగుదేశం టికెట్‌పై పోటీ చేయడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని భావిస్తున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంధ్రలో పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు మధ్యే ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.
ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సొంత పార్టీ పెట్టే పక్షంలో ఆయనకు సీమాంధ్ర ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల్లో చేరటం సాధ్యం కాని సీమాంధ్ర నేతలు కిరణ్ పార్టీ పెడితే అందులో చేరిపోయేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కిరణ్‌కుమార్ రెడ్డి సొంత పార్టీ పెడతారా అనేది సందేహంగానే ఉంది.












Click it and Unblock the Notifications