వారెవ్వా, హత్యలకు పాములను వాడాడు

 Used snakes to murder persons
హైదరాబాద్: హత్యలకు కత్తులను, తుపాకులను, ఇతర మారణాయుధాలను వాడుతుంటారు. కానీ ఓ వ్యక్తి అత్యంత తెలివి ప్రదర్సించి, తాచుపాములను వాడాడు. అతని కుట్రను గమనించిన ఓ కటుంబం అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. అంతకు ముందు నాలుగు సార్లు తాచుపాములను ప్రయోగించడంతో కుటుబానికి అనుమానం వచ్చింది. హైదరాబాదులోని నారాయణగుడాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

హైదరాబాదులోని నారాయణగుడా విఠల్‌వాడీ చౌరస్తాలో అమరజిత్ రెడ్డి (35) అనే వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తులు గత నాలుగు నెలలుగా ప్రతి అమావాస్య రోజు తన ఇంటి ముందు ఓ సంచీని వదిలి వెళ్తుండడాన్ని గమనించాడు. ప్రతి సారీ దాన్ని తెరిచి చూసినప్పుడు ఓ సీసాలో తాచుపాము, నవ ధాన్యాలు, పసుపు కుంకుమ, తదితర సామగ్రి ఉండడం గమనించి తీవ్ర భయాందోళనలకు గురవుతూ వచ్చారు

ఓ అమావాస్య రోజు పాము బతికి ఉంది, మిగతా రోజుల్లో ఊపిరాడక పాములు చనిపోయాయి. అనుమానం వచ్చిన అమర్‌జిత్ రెడ్డి తన ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సరిగ్గా 9 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు కొత్త హోండా స్కూటర్‌పై వచ్చి ఓ సంచిన ఇంటి ముందు పెట్టి పారిపోతుండగా, ఓ వ్యక్తి వెంబడించి వారిని నిలువరించాడు.

అప్పటికే ఓ వ్యక్తి పారిపోయాడు. ఈ సంఘటనలో లాలాగుడాకు చెందిన రైల్వే శాఖలో చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తునన్ నర్సింగరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు అప్పగించారు. నిందితుని స్కూటర్ డిక్కీ తెరవగా మరో రెండు పాములు డబ్బాలో చనిపోయి కనిపించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+