ఓటమికి 'సాక్షి' కూడా: ధైర్యం చెప్పిన జగన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పరాజయం పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించింది. ఇందులో పలువురు నేతలు వారి వారి అభిప్రాయాలు చెప్పారు. పార్టీ ఓటమికి మోడీ హవా, టిడిపి, బిజెపి కూటమికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచారం, చంద్రబాబు రుణమాఫీల ప్రభావంతో పాటు... పార్టీలో సమన్వయం లేకపోవడం, అతివిశ్వాసం, మనం భ్రమల్లో తేలిపోవడం కొంప ముంచాయని పలువురు చెప్పినట్లుగా తెలుస్తోంది.

మూడో రోజైన శుక్రవారం అమలాపురం, నర్సాపురం, రాజమండ్రి లోకసభ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ఫళితాలపై పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ సమీక్షలు జరిపారు. అతివిశ్వాసం, తామే కచ్చితంగా గెలుస్తామని ఊదరగొట్టడం చేటు చేసిందని పలువురు అభిప్రాయపడ్డారు.

YS Jagan

మన పత్రికల కథనాలు కూడా కొంప ముంచాయని చెప్పారట. పత్రికల్లో మన గురించి ఊదరగొట్టడంతో భ్రమల్లో తేలిపోయామని, ఇది నష్టం చేసిందని చెప్పినట్లుగా తెలుస్తోంది. సాక్షి పత్రికను సమీక్షించాలని, పదిమంది నేతలు వస్తే.. వందమంది వచ్చినట్లు రాసేవారని ఆరోపించారని తెలుస్తోంది.

మరోవైపు రైతు రుణమాఫీ హామీ ఇస్తే బాగుంటుందని పలువురు జగన్‌కు సూచించారు. వారి అభిప్రాయంతో ఏకీభవించిన జగన్... అమలుకాని హామీలు ఇవ్వలేకపోయామని, దీనిని పార్టీ నాయకులు, కార్యకర్తలు అర్థం చేసుకోవాలని సూచించారట. ప్రజలు చంద్రబాబును నమ్మి ఓటేశారని, ఇచ్చిన వాగ్దానాలను ఎలా నిలబెట్టుకుంటారో వేచి చూద్దామని, అవి అమలు కాకుంటే ఉద్యమించి ఆ పార్టీపై ఒత్తిడి తేవాలని సూచించారు. ధైర్యంగా ఉండాలని నాయకులకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+