ప్రధాని మోడీ నివాసం వద్ద రాత్రి కాల్పుల కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసం వద్ద బుధవారం రాత్రి కాల్పుల కలకలం చెలరేగింది. 7, రేస్ కోర్స్ రోడ్‌లో ప్రధాని అధికారిక నివాసం ఉంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సదరు భవంతి వద్ద రాత్రి ఉన్నట్టుండి మూడు రౌండ్లు కాల్పులు చోటుచేసున్నాయి.
దీంతో ప్రధాని భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. ప్రధాని నివాసం.. మీడియా పార్కింగ్ వద్ద భద్రతా విధుల్లో ఉన్న ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ చేతిలోని ఏకే 47 మిస్ ఫైర్ కారణంగానే ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు తేలింది.
తుపాకీని లోడ్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఆ తర్వాత భద్రతా అధికారులు తేల్చారు. మిస్ ఫైర్ కారణంగానే జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

బుధవారం రాత్రి సుమారు ఎనిమిది గంటల పదిహేను నిమిషాల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని, ఈ ఘటనలో ఎరూ గాయపడలేదని ప్రాథమిక విచారణలో తేలిందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ప్రధాని నివాసంలోని భద్రతా సిబ్బంది ఘటనపై చాణక్యపురి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు.
బహుళత్వమే భారత్ సామాజిక బలం: మోడీ
భారత్‌కు బహుళత్వంతోపాటు బ్రహ్మాండమైన సామాజిక బలాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అసహనంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని ఇలా స్పందించారు. భిన్నత్వం, బహుళత్వం వంటి అంశాలను ప్రస్తావించడం ఇటీవలి కాలంలో రెండోసారి.












Click it and Unblock the Notifications