టీవీ 9కు ఝలక్: బుల్లెట్ న్యూస్ టార్గెట్ కెసిఆర్
న్యూఢిల్లీ: గతంలో టీవీ 9 బుల్లెట్ న్యూస్ పేరు మీద ఓ కార్యక్రమం ప్రసారం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును అవమానకరంగా చిత్రీకరిస్తూ టీవీ9 ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం టీవీ 9 తెలుగు న్యూస్ చానెల్‌కు కేంద్ర ఝలక్ ఇచ్చింది.
బుల్లెట్ న్యూస్ ప్రసారాలపై టీవీ9కు ఈ ఏడాది మార్చి 27వ తేదీన నోటీసులు జారీ చేసిన కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. క్షమాపణలు చెబుతూ స్క్ర్లోలింగ్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపింది. రాజకీయ వ్యంగ్య వ్యాఖ్యానాలతో రూపొందించిన ఈ కార్యక్రమం కెసిఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రసారం చేసిందని ఆ శాఖ భావించింది.

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సాంబశివరావు, డాక్టర్ సి. గోపాలకృష్ణన్ అడిగిన ఓ ప్రశ్నకు సమాచార ప్రసారాల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఆ విషయాలు చెప్పారు. కేంద్రం గానీ, భారత బ్రాడ్ కాస్ట్రర్స్ అసోసియేషన్ గానీ నిర్దిష్టంగా ఏదైనా చానెల్‌పై, అవి ప్రసారం చేసిన కార్యక్రమాలపై గానీ ఫిర్యాదులందాయా, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిందా, వాటిపై తీసుకున్న చర్యలేమిటని పార్లమెంటు సభ్యులు అడిగారు.
ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ రాజ్యవర్థన్ రాథోడ్ టీవీ9 ప్రసారం చేసిన బుల్లెట్ న్యూస్ కార్యక్రమం గురించి చెప్పారు. 2012 నుంచి 2015 జులై వరకు 91 ఫిర్యాదులు అందాయని, ఇందులో రకరకాల కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications