ఒకరోజు ముందుఇలా: కేజ్రీ యోగా, గురుద్వారలో బేడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసన సభ ఎన్నికల ప్రచార పర్వానికి గురువారంతో తెరపడింది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు శనివారం జరగనున్న ఎన్నికల హడావుడిలో ఉంటారు. లెక్కలు వేసుకోవడం, అంతర్గతంగా మద్దతు కూడగట్టడాలు వంటివి జరుగుతుంటాయి.
అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ మాత్రం అందరికి భిన్నంగా కూల్‌గా ఉన్నారు! శుక్రవారం నాడు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రచారం జోలికి వెళ్లడం లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు తన రోజువారి పనుల్లో నిమగ్నమయ్యారు.

ఆయన ఇంట్లోనే సాదాసీదాగా ఉంటున్నారు. శుక్రవారం నాడు ఉదయం లేచి యోగాసనాలు చేశారు. ధ్యానం చేశారు. తర్వాత బార్బర్ దుకాణానికి వెళ్లారు. అనంతరం పత్రికా పఠనం చేశారు. బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నారు... ఇలా రోజువారి పనుల్లో నిమగ్నమయ్యారు. కేజ్రీవాల్ గురుద్వారాను సందర్శించారు.
మరోవైపు, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ శుక్రవారం నాడు గురుద్వారాను సందర్శించారు. అక్కడ ఆమె పలువురికి ఫుడ్ తదితరాలు ఇచ్చారు. అయితే, ఇది ఆమె మొదటిసారి చేయడం లేదు. ఆమె సామాజిక కార్యకర్త. దీని పైన బేడీ మాట్లాడారు.
తాను ఇలా మొదటిసారి చేయడం లేదని, దీనిని తాను తన కుటుంబ సభ్యుల నుండి నేర్చుకున్నానని, తాను అన్ని మతాలను సమానంగా చూస్తానని చెప్పారు. కాగా, ఢిల్లీ వార్తా పత్రికల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన వచ్చింది. దీని పైన అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అయితే, కేజ్రీవాల్ స్పందన పైన భారతీయ జనతా పార్టీ కూడా స్పందించింది.












Click it and Unblock the Notifications